NTV Telugu Site icon

“ఫ్యామిలీ మ్యాన్-2” ఫ్యాన్స్ కు కొంచెం ఇష్టం… కొంచెం కష్టం…!

Most awaited web series The Family Man 2 Lands On Amazon Prime Video

ట్రైలర్ తో వివాదాస్పదంగా మారిన మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్-2” ఎట్టకేలకు అనుకున్న సమయం కంటే ముందే అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజ్, డికె రూపొందించిన “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2″లో మనోజ్ బాజ్‌పేయి, సమంతా అక్కినేని, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో రాజి అనే శ్రీలంకకు చెందిన తమిళియన్ పాత్రలో నటిస్తోంది సామ్. మేకర్స్ ఈ వెబ్ సిరీస్ ను జూన్ 4న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. సినిమాపై భారీ ఎత్తున వివాదం చెలరేగడంతో అనుకున్న సమయం కంటే ముందే విడుదల చేశారు. అయితే ఈ వెబ్ సిరీస్ ను ముందుగా ప్రకటించినట్టుగా అన్ని భాషల్లో కాకుండా కేవలం హిందీలో వెర్షన్ లోనే విడుదల చేశారు. “ది ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 2″లో త‌మిళ టెర్ర‌రిస్టుగా న‌టించినందుకు ఓ ప‌క్క స‌మంత‌ను నెటిజ‌న్లు ట్రోల్ చేస్తుంటే… మ‌రో ప‌క్క దీని మేక‌ర్స్ రాజ్ అండ్ డీకే ఈ సీజ‌న్ కు ప్రేక్ష‌కుల నుండి పాజిటివ్ రియాక్ష‌న్ వ‌స్తుంద‌నే ఆశాభావాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. త‌మిళ‌నాడులోని రాజ‌కీయ పార్టీలు, నేత‌లు ఈ వెబ్ సీరిస్ ను బ్యాన్ చేయాల‌ని కోరినా కేంద్రం మాత్రం మౌనం వ‌హించింది. అయితే త‌మ వెబ్ సీరిస్ ట్రైల‌ర్ లోనో కొన్ని స‌న్నివేశాల‌ను చూసి, అపోహ‌ల‌కు గురి కావ‌ద్ద‌ని చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ లో వ‌ర్క్ చేసిన వారిలో అత్య‌ధిక శాతం మంది త‌మిళులే ఉన్నార‌ని, ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన ప్రియ‌మ‌ణి, స‌మంత‌, ర‌చ‌యిత సుమన్ కూడా ఆ ప్రాంతం వారేనని, తమకు త‌మిళ సంస్కృతి, సంప్ర‌దాయాలంటే అపార‌మైన గౌర‌వం ఉంద‌ని, కాబ‌ట్టి ఏ ప‌రిస్థితుల్లోనూ త‌మిళ‌ల‌ను అవ‌మానించ‌డం అనేది తమ వెబ్ సీరిస్ లో జ‌ర‌గ‌ద‌ని హామీ ఇస్తున్నారు. అయినప్పటికీ ఈ వివాదం సద్దుమణగలేదు. పైగా వెబ్ సిరీస్ విడుదల నేపథ్యంలో “షేమ్ ఆన్ యూ సమంత” అనే హ్యాష్ ట్యాగ్ ను ఈరోజు ట్రెండ్ చేశారు తమిళ తంబీలు. మరోపక్క తెలుగు ప్రేక్షకులకు కూడా “ది ఫ్యామిలీ మ్యాన్-2” విడుదల గురించి టెన్షన్ మొదలైంది. ఎందుకంటే అంతా ఎంతో ఆతృతగా ఎదురు చూసిన “మీర్జాపూర్-2” వెబ్ సిరీస్ ను తెలుగులో విడుదల చేయనున్నట్టు ప్రకటించిన మేకర్స్… చివరి నిమిషంలో తెలుగువారికి షాక్ ఇచ్చారు. ఆ తరువాత ఎప్పటికో “మీర్జాపూర్-2” తెలుగు సిరీస్ ను విడుదల చేశారు. ఇప్పుడు కూడా “ఫ్యామిలీ మ్యాన్-2” విషయంలో అదే జరుగుతుందేమో అని టెన్షన్ పడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. అనుకున్న సమయం కంటే ముందే “ఫ్యామిలీ మ్యాన్-2” రిలీజ్ కావడం కొంచెం ఇష్టం అయినా… తెలుగులో విడుదల కాకపోవడం కొంచెం కష్టంగా మారింది సామ్ అభిమానులకు… మరి “ఫ్యామిలీ మ్యాన్-2” తెలుగు వెర్షన్ ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి. “ఫ్యామిలీ మ్యాన్-2″కు అసలు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో, అలాగే హిందీ వెర్షన్ చూసాకైనా తమిళ తంబీలు శాంతిస్తారేమో వెయిట్ అండ్ సి..!