NTV Telugu Site icon

సాహిత్య శిఖరం నేలకొరిగింది : మోహన్‌బాబు

తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో గొప్ప పాటలను అందించిన గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ రోజు సాయంత్రం కన్నుమూశారు. ఈ న్యూమెనియోతో బాధపడుతున్న ఆయన నెల 24న కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. అయితే ఈ రోజు సాయంత్రం సిరివెన్నెల మరణవార్తతో ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సిరివెన్నెల మృతిపై రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

అయితే సిరివెన్నెల మృతిపై విలక్షణ నటుడు మోహన్‌బాబు స్పందిస్తూ.. సిరివెన్నెల సీతారామశాస్త్రి… నాకు అత్యంత సన్నిహితుడు.. సరస్వతీ పుత్రుడు… విధాత తలపున ప్రభవించిన సాహిత్య శిఖరం నేలకొరిగింది… ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అంటూ ట్విట్టర్‌ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.