NTV Telugu Site icon

మేకోవర్ తో ఆకట్టుకుంటున్న మీరా జాస్మిన్

‘అమ్మాయి బాగుంది’, ‘గుడుంబా శంకర్’, ‘భద్ర’, ‘పందెం కోడి’, ‘మహారథి’, ‘గోరింటాకు’ వంటి చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు సంపాందించింది నటి మీరా జాస్మిన్. తన నటనతో మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలను పోషించింది. అయితే తెలుగులో ఆమె చివరి చిత్రం 2013లో వచ్చిన ‘మోక్ష’. ఆ తర్వాత తమిళ, మలయాళ సినిమాలలో నటించినా అంత యాక్టివ్ గా అయితే లేదు.

జాతీయ అవార్డు కూడా గెలుచుకున్న మీరా జాస్మిన్ అంటే సినిమా ప్రేక్షకులకు ఇప్పటికీ ఇష్టమే. మీరా ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఓపెన్ చేసింది. తొలి పోస్ట్ లో దర్శకుడు సత్యన్ అంతికాడ్ తో కలసి చేయబోతున్న మలయాళ చిత్రం ‘మకల్’ నుండి స్టిల్‌ను పోస్ట్ చేసింది. ఇక ఇన్ స్టాలో మీరా మేకోవర్ ను చూసిన వారికి మళ్ళీ పూర్తి స్థాయిలో నటిగా ఫోకస్ పెట్టబోతోందనే విషయం అర్థం అవుతోంది. అంతే కాదు తను రీ-ఎంట్రీ స్టెప్ తీసుకుంటున్నందుకు ఆనందంగా ఉందని చెబుతోంది. ఇన్ స్టాలో మీరాని చూస్తే మళ్ళీ బిజీ అవటం ఖాయం అనే అనిపిస్తుంది. మరి తెలుగులో ముందుగా ఎవరు మీరా జాస్మిన్ కి అవకావం ఇస్తారో చూద్దాం.