NTV Telugu Site icon

Mehreen Pirzada: అంత కష్టపడి చేస్తే సె* క్లిప్ అంటారా.. హానీ పాప ఆవేదన

Mehreen Pirzadaa Thumb

Mehreen Pirzadaa Thumb

Mehreen Pirzada slams people calling trolling her web drama scene: కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి “ఎఫ్ 2,” “రాజా ది గ్రేట్,” “మహానుభావుడు” వంటి తెలుగు సినిమాలతో మంచి గుర్తింపు పొందిన మెహ్రీన్ పిర్జాదా ఈమధ్యనే ఒక వెబ్ సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆమె చేసిన సీన్ లో ఆమె కాస్త ఘాటుగా రొమాన్స్ చేయడంతో ట్రోల్స్‌కు గురి అయింది. మెహ్రీన్ పిర్జాదా “సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ” అనే వెబ్ సిరీస్‌లో తన OTT అరంగేట్రం చేసింది. ఈ సిరీస్ లో ఆమె సెక్స్ సన్నివేశాలతో పాటు లిప్-టు-లిప్ కిస్ సన్నివేశాలలో కూడా చాలా చలాకీగా కనిపిచింది. అయితే ఈ సిరీస్ విషయంలో మెహ్రీన్ నెటిజన్ల నుండి నెగటివ్ ట్రోల్స్, ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది. డిస్నీ+హాట్‌స్టార్‌లో వెబ్ సిరీస్ ప్రీమియర్ అయినప్పటి నుండి మీమ్స్, ఆ సీన్స్ వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ ట్రోల్స్‌పై స్పందిస్తూ, అలాంటి సన్నివేశాలలో నటించడంపై తన వైఖరి గురించి ఆమె తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసింది. ఈ సీన్స్ పబ్లిక్ నైతిక ప్రమాణాలకు అనుగుణంగా లేకపోయినా, ఒక ప్రొఫెషనల్ యాక్టర్‌గా, కథాంశానికి అనుగుణమైన సీన్ లో నటించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొంది.

Mansion 24 Web Series : ఓటీటీ లోకి వచ్చేసిన మాన్షన్ 24 వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

ఈ మేరకు ఆమె ఒక సుధీర్ఘ నోట్ షేర్ చేశారు. ఇటీవలే నేను డిస్నీ హాట్‌స్టార్‌లో “సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ” అనే వెబ్ సిరీస్‌లో నా OTT అరంగేట్రం చేసా, నా అభిమానులు ఈ సిరీస్‌ని చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నా, కొన్నిసార్లు స్క్రిప్ట్‌లు మీ స్వంత నైతికతకు విరుద్ధంగా ఉండే కొన్ని చర్యలను డిమాండ్ చేసినా నటనను ఒక కళగా భావించి, వృత్తిగా భావించే నటిగా, కథ కథనంలో భాగమైతే రుచించని కొన్ని సీన్స్ లో కూడా నటించాల్సి ఉంటుంది. ఢిల్లీ సుల్తాన్‌లో క్రూరమైన వైవాహిక అత్యాచారాన్ని షూట్ చేసే సీన్ ఉంది. వైవాహిక అత్యాచారం వంటి తీవ్రమైన సమస్యను మీడియాలో చాలా మంది “సెక్స్ సీన్”గా అభివర్ణించడం నాకు బాధ కలిగించింది, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మహిళలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యగా దీనిని మీడియాలోని ఒక నిర్దిష్ట వర్గం, సోషల్ మీడియాలోని వ్యక్తులు దీనిని ట్రోల్ చేయడం కలవరపెడుతోందని అన్నారు.

ఈ వ్యక్తులు తమకు సోదరీమణులు, కుమార్తెలు కూడా ఉన్నారని అర్థం చేసుకోవాలి, వారు తమ స్వంత జీవితంలో అలాంటి బాధను ఎప్పటికీ ఎదుర్కోవద్దని నేను దేవుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. మహిళలపై ఇటువంటి క్రూరత్వం, హింస యొక్క ఆలోచన అసహ్యకరమైనదని, నటిగా ఆ పాత్రకు న్యాయం చేయడం నా పని, మిలన్ లుత్రియా సర్ నేతృత్వంలోని సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ బృందం చాలా కష్టతరమైన సీన్స్ షూటింగ్ సమయంలో నటులుగా మనం ఏ సమయంలోనూ అసౌకర్యంగా లేదా బహిర్గతం కాకుండా చూసుకోవడంలో చాలా ప్రొఫెషనల్‌గా ఉన్నానని అన్నారు. మహాలక్ష్మి అయినా, సంజన అయినా, హనీ అయినా నా ప్రేక్షకుల కోసం ఆర్టిస్ట్‌గా ప్రతి పాత్రలోనూ నా సత్తా చాటాలని ఆశిస్తున్నానని ఆమె అన్నారు.

Show comments