NTV Telugu Site icon

విజయ్ సీక్రెట్స్ బయట పెట్టిన మాళవిక మోహనన్!

విజయ్ సోషల్ మీడియాలో పెద్దంతగా కనిపించడు. పబ్లిక్ ఫంక్షన్స్ కూ హాజరయ్యేది తక్కువే! ఎప్పుడో ఒకటి రెండు సార్లు మాత్రం అలా మెరుపులా మెరుస్తుంటాడు. కానీ అతని అభిమానులు సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇటీవల విజయ్ బర్త్ డే సందర్భంగా కూడా అతని అభిమానులు ట్విట్టర్ స్పేస్‌ సెషన్ ఒకటి ఏర్పాటు చేసి, గ్రాండ్ సక్సెస్ అందుకున్నారు. విశేషం ఏమంటే… ఆ సెషన్ లో పలువురు హీరోయిన్లు కూడా పాల్గొన్నారు. అందులో పాల్గొన్న ‘మాస్టర్’ బ్యూటీ మాళవిక మోహనన్ … స్టార్ హీరో విజయ్ కు సంబంధించిన వ్యక్తిగత రహస్యాలు కొన్నింటిని బయట పెట్టేసింది.

Read Also: ఫారెస్ట్ ఫ్రంట్ లైన్ హీరోస్ కు అంబాసిడర్ గా ఉపాసన

తమిళ అభిమానులు దళపతి అని అభిమానంగా పిలుచుకుని విజయ్‌కు బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ అంటే ఎంతో ఇష్టమని మాళవిక చెప్పింది. విజయ్ తో కలిసే తాను ‘బాఘీ -3’ మూవీని చూశానని, టైగర్ ష్రాఫ్ ఎంట్రీ సీన్స్ చూసి విజయ్ ఆనందంతో ‘తలైవా’ అంటూ అరిచాడని మాళవిక మోహనన్ తెలిపింది. అలానే విజయ్‌ కు చెన్నయ్, తమిళనాడు తర్వాత అత్యంత ఇష్టమైన ప్రదేశం న్యూయార్క్ అని అంది. కేవలం విజయ్ సరసన ‘మాస్టర్’ సినిమా ఒక్కదానిలోనే నటించిన మాళవిక… ఈ స్టార్ హీరోని బాగానే స్టడీ చేసినట్టు కనిపిస్తోంది. సో… బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ అంటే దళపతి విజయ్‌ కు ఇష్టం కాబట్టి… భవిష్యత్తులో వీరిద్దరి కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ మూవీ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.