NTV Telugu Site icon

నాగబాబు ‘మా’ మ‌స‌క‌బారింద‌నటం బాధాకరం: న‌రేష్

టాలీవుడ్ లో ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్) ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. నిన్న మెగా బ్రదర్ నాగబాబు, నిర్మాత బండ్ల గణేష్ తో పాటు పలువురు ప్రకాష్ రాజ్ కు మద్దతు తెలియజేస్తూ మాట్లాడారు. అయితే.. తాజాగా ఈరోజు సీనియర్ నటుడు, ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేష్.. ప్రకాష్ రాజ్ టీమ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ‘మా’ తరపున మేం చేసిన కార్యక్రమాలన్నీ చిరంజీవి, నాగబాబుకు చెపుతునే వస్తున్నాం. అయినా కూడా నాలుగేళ్లుగా ‘మా’ మసకబారిపోయిందని నాగబాబు అనడం మమ్మల్ని షాక్‌కు గురిచేసింది అని నరేష్ అన్నారు. నాగ‌బాబు త‌న‌కు మంచి మిత్రుడ‌ని, ఆయ‌న‌ అంటే త‌న‌కు గౌర‌వం ఉంద‌ని చెప్పారు. ఈ సందర్భంగా గత రెండేళ్లలో ‘మా’ కోసం తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రకాశ్‌రాజ్‌ తనకు మంచి మిత్రుడని… మూడు నెలల క్రితమే ఈ ఏడాది ‘మా’ ఎలక్షన్‌లో పోటీచేస్తున్నట్లు ప్రకాష్ రాజ్ తనకు తెలిపాడని నరేష్ చెప్పుకొచ్చారు. తెలుగు సినిమాల్లో నటించేవాళ్లు ఎవరైనా పోటీ చేయవచ్చని సమాధానంగా చెప్పానని నరేష్ తెలిపారు.