NTV Telugu Site icon

చదువుకి గుడ్ బై చెప్పి… బాలీవుడ్ బరిలో దిగుతోన్న మరో వారసుడు!

బాబిల్ ఖాన్… క్యాన్సర్ తో మరణించిన టాలెంటెడ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ తనయుడు. ఇన్నాళ్లూ లండన్ లో ఫిల్మ్ కోర్స్ చదువుతున్నాడు. అయితే, తాజాగా ఆయన తన ఫిల్మ్ బీఏ కోర్స్ కి మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టేశాడు. తాను డ్రాప్ అవుట్ అవుతున్నట్టుగా బాబిల్ ఇన్ స్టాగ్రామ్ లో తెలిపాడు. తన ఆప్త మిత్రులు ఇంత కాలం అండగా ఉన్నారనీ, వారికి కృతజ్ఞతలు అంటూ… తన మనసులోని మాటల్ని బయటపెట్టాడు. అంతే కాదు, ఇక మీద పూర్తి స్థాయిలో నటన మీద దృష్టి పెడతానని వివరించాడు.
ఇర్ఫాన్ ఖాన్ తనయుడైన బాబిల్ ఖాన్ ఇప్పటికే ఓ డిజిటల్ ప్రాజెక్ట్ సైన్ చేశాడు. తృప్తి దిమ్రీతో అతను వెబ్ సిరీస్ లో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. అనుష్క శర్మ నిర్మాతగా వ్యవహరిస్తూ తన స్వంత బ్యానర్ లో సిరిస్ రూపొందిస్తోంది. కాగా బాబీల్ గతంలో ఓ సారి పెద్ద తెరపై కనిపించాడు. ‘కరీబ్ కరీబ్ సింగిల్’ అనే సినిమాలో కొన్ని సెకన్ల పాటూ కనిపించే చిన్న పాత్రలో నటించాడు. ఆ సినిమాలో ప్రధాన పాత్ర ఇర్ఫాన్ ఖాన్ దే! తండ్రి ముందు అప్పట్లో నటించటం మరిచిపోలేని జ్ఞాపకం అన్న బాబీల్ ఇప్పుడు ఆయన తన నటన చూడటానికి లేకపోవటం… తీరని లోటన్నాడు.
నటన కోసం ఫిల్మ్ కోర్స్ మధ్యలోనే ఆపేసి ఇండియాకి వచ్చేస్తోన్న బాబీల్ ఖాన్ ఇంకా పూర్తి స్థాయి సినిమా సైన్ చేయలేదు. పెద్ద తెరపై హీరోగా ఎంట్రీ ఇస్తే ఇర్ఫాన్ ఖాన్ అభిమానులు, ఇతర ప్రేక్షకులు ఈ యంగ్ టాలెంట్ ని ఎలా రిసీవ్ చేసుకుంటారో మరి!