NTV Telugu Site icon

పుకార్లకు చెక్: క్యూట్ అందానికి తగ్గట్టే క్లారిటీ ఇచ్చిన కృతిశెట్టి

క్యూట్ గర్ల్ కృతి శెట్టి నటించిన తొలి చిత్రం ‘ఉప్పెన’ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుసగా సినీ అవకాశాలు దక్కించుకుంటోంది. నానితో కలిసి ‘శ్యామ్‌ సింగరాయ్‌’.. సుధీర్‌బాబుతో కలిసి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’.. రామ్, లింగుస్వామి కాంబోలో వస్తున్న ఓ సినిమాలోనూ నటించనుంది. ఇదిలావుంటే, కృతి మరిన్ని కొత్త ప్రాజెక్టులను కూడా ఒకే చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్​ కుమారుడు గణేశ్​ త్వరలోనే సినిమాల్లో అరంగేట్రం చేయనున్న సినిమాలోనూ కృతి ఎంపిక అయినట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ రూమర్లకు చెక్ పెట్టేలా​ కృతిశెట్టి సోషల్​మీడియాలో స్పందించింది. ‘నేను నటించబోతున్న కొత్త సినిమాలపై చాలా రూమర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ​నేను మూడు సినిమాల్లో నటిస్తున్నాను. నాని, సుధీర్​ బాబు, రామ్ తో నటిస్తున్నాను. ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడమే ఇప్పుడు నా ముందున్న లక్ష్యం. ఏవైనా సినిమాలకు సంతకం చేసినప్పుడు తప్పకుండా తెలియజేస్తాను’ అంటూ కృతి క్లారిటీ ఇచ్చింది.