NTV Telugu Site icon

నయనతార చిత్రానికి అతడే విలన్!

దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార చిత్రసీమలోకి అడుగుపెట్టి 18 సంవత్సరాలు గడిచినా… ఇంకా తన సత్తా చాటుతూనే ఉంది. కొంతకాలంగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కు నయన్ ప్రాధాన్యమిస్తున్నా, స్టార్ హీరోల చిత్రాలలోనూ నటిస్తూనే ఉంది. తాజాగా ఆమె పేషన్ స్టూడియోస్ తో రెండు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకుంది. అభిషేక్ పిక్చర్స్ తో కలిసి వీటిని పేషన్ స్టూడియోస్ నిర్మించనుంది. అందులో మొదటి ప్రాజెక్ట్ ను ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించబోతున్నాడట. ఈ మూవీలో రెండు ప్రధానమైన పురుష పాత్రలు ఉన్నాయట. అందులో నయన్ కు దీటుగా ఉండే విలన్ పాత్రకోసం కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ను అడిగారని తెలుస్తోంది. శాండిల్ వుడ్ లో హీరోగా నటిస్తున్నా, సుదీప్ ఇతర భాషల్లో విలన్ గా చేయడానికి అభ్యంతరం పెట్టడం లేదు. ఆ రకంగా నయన్ సినిమా కథలో తన పాత్రకు ప్రాధాన్యముంటే సుదీప్ అంగీకరించే ఆస్కారం ఉంది. అలానే మరో కీలకమైన మెల్ క్యారెక్టర్ కోసం ఎవరి తీసుకుంటారో తెలియాలి! కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో నయన్ తాజా చిత్రాలకు సంబంధించిన అధికారిక సమాచారం అతి త్వరలోనే వస్తుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే గత యేడాది ‘అమ్మోరు తల్లి’గా డిస్నీ హాట్ స్టార్ ఓటీటీ ద్వారా వీక్షకుల ముందుకు నయన్ వచ్చింది. అలానే ఆమె నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ ‘నెట్రికన్’ సైతం ఓటీటీలోనే విడుదల కాబోతోందని అంటున్నారు. ఇవి కాకుండా రజనీకాంత్ ‘అన్నాత్తే’, విజయ్ సేతుపతి ‘కాతువాకుల రెండు కాదల్’ చిత్రాలలో నయన్ నటిస్తోంది.