ట్రక్ డ్రైవర్ గా మారిన నటి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెండితెరపై నటీనటులుగా గుర్తింపు పొందినంత మాత్రాన వారి జీవితాలు వడ్డించిన విస్తరి అనుకోవడానికి వీలు లేదు. అవకాశాలు తగ్గగానే… ఎవరైనా ఏదో ఒక జీవనోపాథి ఎంచుకోవాల్సిన పరిస్థితే. మలయాళంతో పాటు పలు తమిళ చిత్రాలలోనూ నటించిన కార్తీక మాథ్యూ పరిస్థితి కూడా అంతే. చిన్నప్పటి నుండి నటన అంటే మక్కువ ఉన్న కార్తీక యుక్త వయసులో సినిమా నటిగా అవకాశాల కోసం ప్రయత్నించింది. అందులో సక్సెస్ అయ్యింది కూడా. కానీ ఆ తర్వాత వివాహానంతరం ఆమె నటనకు దూరమైంది. అయితే నటనతో పాటు చిన్నప్పటి నుండి తనకు ఇష్టమైన డ్రైవింగ్ పై దృష్టి పెట్టింది. సొంత గ్రామంలో పలు వాహనాలను డ్రైవింగ్ చేయడం ప్రాక్టీస్ చేసిన కార్తీక గత యేడాది లాక్ డౌన్ వల్ల ఉపాథి అవకాశాలు దొరకపోవడంతో ప్రొఫెషనల్ డ్రైవర్ గా మారిపోయింది. తన దగ్గర ఉన్న కాస్తంత డబ్బులతో ఓ ట్రక్ ను కొని పళ్ళను ట్రాన్స్ పోర్ట్ చేయడానికి దానిని వినియోగించడం మొదలెట్టింది. విశేషం ఏమంటే… తన సొంత ఊరు కన్నూర్‌లోని అజికోడ్ నుండి వజక్కుళంకు పైనాపిల్స్ ను తీసుకెళ్ళి అక్కడి నుండి కొబ్బరికాయలను ట్రక్ లో లోడ్ చేయించి… తిరిగి వస్తూ దుకాణాలలో దింపేది. రాత్రిపూట ట్రక్ నడపడం అంటే తనకెంతో ఇష్టమని, ఆ సమయంలో టీ షర్ట్, జీన్స్ ధరిస్తుంటానని, దానిపై డ్రైవర్స్ డ్రస్ వేసుకుంటానని కార్తిక చేబుతోంది.
తాను యుక్త వయసులో ఉండగా నటించిన చిత్రాలలో ‘కెనాలమ్ కైనరం’, మక్కనా చిత్రాలు తనకెంతో ఇష్టమని, ఇప్పటికీ అవకాశాలు రావాలే కానీ నటించడానికి సిద్ధమని కార్తీక మాథ్యూ చెబుతోంది. కార్తీక ట్రక్ డ్రైవింగ్ చేస్తుండగా ఇటీవల ఓ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు ఆపి, ఆమె నుండి వివరాలు సేకరిస్తుంటే, ఆమె ఓ నటి అనే విషయాన్ని గుర్తించిన పోలీసులు ఆమె ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఇప్పుడు అందరి దృష్టీ మరోసారి కార్తీక మాథ్యూపై పడింది. తనకు జీవితంలో టిప్పర్ ను కొని ఫుల్ లోడ్ తో నడపాలనే కోరిక ఉందని కార్తీక చెబుతుంటుంది. ఆమె భర్త శ్రీజిత్ విదేశాలలో పనిచేస్తుండగా, కొడుకు శ్రీనాథ్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఇప్పుడు మరోసారి వార్తల్లోకి వచ్చిన కార్తీకకు తమిళ, మలయాళ చిత్ర దర్శకులు మళ్ళీ అవకాశం ఇస్తారేమో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
-
Mega Multistarrer : ఒకే స్క్రీన్‌పై వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న నిహారిక
-
Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
-
Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్‌తో అభిమానుల భారీ వేడుకలు!
-
Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్‌ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!