NTV Telugu Site icon

Kangana Ranaut: అందుకే ధాకడ్ ఫ్లాప్ అయింది.. కంగనా ఫైర్

Kanganaa

Kanganaa

బాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని పేరు కంగనా రనౌత్. వివాదాలకు ఆమె కేరాఫ్ అడ్రస్. తాజాగా థాకడ్ మూవీ ఫ్లాప్ కావడంపై ఆమె మండిపడుతోంది. ఈ మూవీపై వచ్చిన వ్యతిరేక ప్రచారమే సినిమా పరాజయానికి కారణమంటోంది కంగనా. తన నిర్మాత ఆస్తులు, ఆఫీసులు అమ్ముకోలేదని, కొందరు చిల్లర వ్యక్తుల దుష్ర్పచారం వల్ల కొంత ఇమేజ్ తగ్గిందన్నారు. సినిమాపై నిర్మాత సంతృప్తికరంగానే ఉన్నారని వ్యాఖ్యానించింది.

‘ధాకడ్’ సినిమాపై ఇంటర్నెట్‌, సోషల్ మీడియాలో నెగిటివ్ పబ్లిసిటీ పెరిగిందని, అది చూసి సినిమా చూడడానికి జనం రావడం లేదంటున్నారు కంగనా. అలాంటి వార్తలు రాసేవారిని ఆమె చిల్లర వ్యక్తులుగా కంగనా అభివర్ణించారు. ధాకడ్ సినిమా పరాజయంతో నిర్మాత ఆస్తులు అమ్ముకున్నారంటూ వస్తున్న వార్తలపై ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. ఆ సినిమా నిర్మాత ఆస్తులు, ఆఫీసులు అమ్ముకోలేదని పేర్కొన్నారు. సినిమా ఫలితంపై నిర్మాత దీపక్ ముకుత్ సంతృప్తిగానే ఉన్నట్టు చెప్పారు. కొంతమంది వల్ల ఇలాంటి దురభిప్రాయం ఏర్పడిందన్నారు కంగనా. ఈ సినిమాపై వస్తున్న వార్తల్ని తాను చదువుతున్నానన్నారు.

ఇప్పటికే ఫ్లాప్ అయిన గంగూబాయి కఠియావాడి, జుగ్‌జుగ్‌జీయో, 83 సినిమాల ప్లాప్‌ల గురించి మీడియా ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. అర్జున్ రాంపాల్, దివ్యదత్తా, కంగన తదితరులు నటించిన ఈ సినిమాను రూ. 80 కోట్ల బడ్జెట్‌తో కొత్త దర్శకుడు రజనీష్ ఘాయ్ తెరకెక్కించారు. కంగన కెరియర్‌లోనే డిజాస్టర్‌గా నిలిచిన ఈ సినిమా కేవలం రూ. 4 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

Delhi: ఢిల్లీలో మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం.. అమిత్ షాతో కీలక చర్చలు