NTV Telugu Site icon

‘మై నేమ్ ఈజ్ శ్రుతి’ అంటున్న హన్సిక

ప్రముఖ కథానాయిక హన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం’మై నేమ్ ఈజ్ శ్రుతి’. ది హిడెన్‌ ట్రూత్‌ అనేది ఉపశీర్షిక. రమ్య బురుగు, నాగేందర్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి. శ్రీనివాస్‌ ఓంకార్‌ దర్శకుడు. ఇటీవల చిత్రీకరణ ప్రారంభమైన ఈ చిత్రం తొలిషెడ్యూల్‌ని పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ ‘బ్యాక్‌ అండ్‌ ఫోర్త్‌ స్క్రీన్‌ప్లేతో రూపుదిద్దుకుంటున్న సినిమా ఇది. ఇలాంటి పాత్రను హన్సిక ఇప్పటి వరకు తన కెరియర్‌లో పోషించలేదు. ఈ సస్సెన్స్‌ థ్ల్రిలర్‌ మూవీ ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఓ యువతి తన జీవితంలో ఎదురైన సంఘర్షణలను ఎలా ఎదుర్కొన్నది అనేది చిత్ర కథాంశం. ఆగస్టు రెండో వారంలో సెకండ్ షెడ్యూల్‌ ప్రారంభిస్తాం’ అన్నారు.

మురళీశర్మ, జయప్రకాష్‌, ‘ఆడుకాలం’ నరేన్‌, రాజా రవీంద్ర, సీవీఎల్‌, వినోదిని, సాయితేజ్‌ కాల్వకోట, మహేష్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘మై నేమ్ ఈజ్ శ్రుతి’కి సినిమాటోగ్రాఫర్ కిషోర్ బోయిడపు కాగా, మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నారు.