NTV Telugu Site icon

గుడ్‌ లక్‌ సఖి రీలీజ్‌ డేట్‌ ఫిక్స్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కీర్తి సురేష్. ఆతర్వాత ఈ అమ్మడు వరుస సినిమాలతో తెలుగులో బిజీ అయ్యింది కీర్తి. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది కీర్తి సురేష్. తాజాగా కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో న‌టిస్తోన్న చిత్రం గుడ్ లక్ సఖి. ఈ చిత్ర విడుదలకు సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఈ చిత్ర విడుదలను ఎందుకో పలు కారణాల వల్ల దర్శక నిర్మాతలు వాయిదా వేశారు. ఇది వరకు నవంబర్ 26న విడుదల చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ఈ చిత్రాన్ని డిసెంబర్ 10న విడుదల చేయబోతోన్నట్టు మేకర్లు ప్రకటించారు. కానీ డిసెంబర్‌లో భారీ చిత్రాల రీలీజ్‌లు ఉండటంతో మేకర్స్‌ వెనుకడు వేస్తున్నారని సమాచారం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర యూనిట్‌ ప్రకటించింది. డిసెంబర్‌ 31న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రానుందని మేకర్స్‌ ప్రకటించారు.

ఈ ఏడాది విడుదలయ్యే ఆఖరి టాలీవుడ్‌ సినిమా ఇదే కానుంది. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న గుడ్ లక్ సఖి చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి నిర్మిస్తున్నారు. చిరంతాన్ దాస్ సినిమాటోగ్రాఫ‌ర్‌. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్, పోస్టర్లు అన్నీ కూడా విశేషమైన ఆదరణను సొంతం చేసుకున్నాయి. కాగా గ్రామీణా నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీల‌క పాత్రల్లో నటిస్తున్నారు.