దబ్బూ రత్నానీ… ఈయనెవరో తెలియని వారు చాలా మంది ఉంటారు. కానీ, ఈయన సంవత్సరానికి ఓ సారి జనంలోకి వదిలే సెలబ్రిటీ ఫోటోస్ తో కూడిన క్యాలెండర్… అందరికీ బాగానే తెలిసి ఉంటుంది. దబ్బూ రత్నానీ క్యాలెండర్ అంటే బీ-టౌన్ సెలబ్రిటీల్లోనూ క్రేజ్ ఉండటం విశేషం. ఆయన కెమెరా ముందు నిలబడి ఫోజులివ్వటం అంటే ప్రెస్టేజీగా ఫీలవుతారు ముంబై తారలు. అయితే, 2021 దబ్బూ రత్నానీ క్యాలెండర్ బాగా లేటైపోయింది. కరోనా లాక్ డౌన్ కారణంగా ఇన్ని నెలలు డిలే అయ్యి ఇప్పుడు బయటకొచ్చింది. దబ్బూ రత్నాని సెలబ్ పిక్స్ లో కొన్ని అప్పుడే ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి…
ఆలియా భట్ బ్లూ గౌన్ లో సింపుల్ గానే కనిపించినా స్టైలిష్ గా ఆకట్టుకుంది. నవ్వుతున్న నీలాకాశంలా ‘ఆర్ఆర్ఆర్’ బ్యూటీ చూసేవార్ని మాయ చేసింది!
కరోనా క్లిష్ట పరిస్థితుల కారణంగా ఈ సారి సైఫ్ అలీఖాన్ రెడ్ హాట్ పిక్ ఆయన ఇంట్లోనే క్లిక్ మనిపించారట. కేవలం 5 నిమిషాల్లో తీసినా కూడా ఈ షాట్ అద్భుతంగా వచ్చిందని దబ్బూ రత్నానీ వివరించాడు…
బాలీవుడ్ గ్రీక్ గాడ్, ఇండియన్ సూపర్ హీరో, హృతిక్ రోషన్… చొక్కా విప్పి చుక్కల నడుమ సూర్యుడిలా వెలిగిపోయాడు! కండలు తిరిగిన శరీరంతో, రొటీన్ కి భిన్నంగా, నిలుచుకుని కాకుండా ఈసారి పడుకుని ఫోజిచ్చాడు!
పేరులోనే తారని ఇముడ్చుకున్న యంగ్ బాలీవుడ్ బ్యూటీ తారా సుతారియా. లాంగ్ షర్ట్ వేసుకుని బటన్ పెట్టుకోవటం మరిచిన ఈ లవ్లీ లేడీ… పొడవాటి బూట్స్ వేసుకుని… కుర్రాళ్ల కోరికలకి కాల్సినంత బూస్ట్ ఇచ్చింది!
ప్యాండమిక్ పరిస్థితుల దృష్ట్యా ఈసారి దబ్బూ రత్నానీ క్యాలెండర్ ఆలస్యం అవ్వటమే కాదు ఆన్ లైన్ లోనే ఫోటోలన్నీ ఆవిష్కరించారు కూడా!