NTV Telugu Site icon

Game Changer : సరికొత్త రికార్డ్ ను బ్రేక్ చేసిన రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’..

Game Changer

Game Changer

త్రిపుల్ ఆర్ ఘన విజయం అందుకోవడంతో పాటు ఆస్కార్ ను కూడా గెలుచుకుంది.. ఆ సినిమాతో మెగా హీరో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆయన రేంజ్ పెరిగిపోయింది.. ఇక ఇప్పుడు రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తారా అని మెగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు.. ఈ క్రమంలో రోబో ఫెమ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.. గేమ్ చేంజర్’ అనే చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.. ఆ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది..

ఈ సినిమా #RRR మూవీ విడుదల సమయం లో ప్రారంభం అయ్యింది. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వాస్తవానికి ఈ చిత్రం ఎప్పుడో పూర్తి అవ్వాలి. కానీ షూటింగ్ జరుగుతున్న సమయం లోనే శంకర్ కమల్ హాసన్ తో చేస్తున్న ‘ఇండియన్ 2 ‘ చిత్రాన్ని కూడా తిరిగి ప్రారంభించాల్సి వచ్చింది.. దాంతో రామ్ చరణ్ సినిమాకు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది..నెల రోజుల్లో 15 రోజులు ఇండియన్ 2 కి పని చేస్తే మరో 15 రోజులు ‘గేమ్ చేంజర్’ చిత్రానికి పని చెయ్యాల్సి వచ్చింది. అందుకే షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. వచ్చే ఏడాది సమ్మర్ లో కూడా సినిమా విడుదలయ్యేలా కనిపించలేదు..

ఇకపోతే శంకర్ తన సినిమాల్లో పాటలను ఎంత రిచ్ గా తీస్తాడో మన అందరికీ తెలిసిందే. మూడు దశాబ్దాల నుండి ఆయన పాటలను మనం చూస్తూనే ఉన్నాం..సినిమా బడ్జెట్ వంద శాతం లో ఆయన 50 శాతం పాటల కోసమే ఖర్చు చేస్తాడు. అలా ఆయన రీసెంట్ గా రామ్ చరణ్ తో చేస్తున్న ‘గేమ్ చేంజర్’ లో కూడా పాటల కోసం అదే రేంజ్ లో ఖర్చు చేస్తున్నాడు. అందుతున్న కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఆయన ఈ సినిమాకి 5 పాటల కోసం 90 కోట్ల రూపాయిలు ఖర్చు చేసాడట. ఇది ఒక స్టార్ హీరో కమర్షియల్ సినిమాకి అయ్యే ఖర్చు… చరణ్ సినిమాలో కేవలం పాటల కోసమే ఇంత ఖర్చు చెయ్యడం మామూలు విషయం కాదు..ఇక సినిమా బడ్జెట్ దాదాపుగా 300 కోట్ల రూపాయిలు దాటిపోయిందని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ కూడా ఇవ్వకపోవడం ఇప్పుడు అభిమానులు చాలా కోపానికి గురి చేస్తుంది.. మరి ఈ సినిమా గురించి మరో అప్డేట్ ఎప్పుడొస్తుందని మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..