NTV Telugu Site icon

RRR కోసం వెయిటింగ్ అంటున్న పూజా హెగ్డే

జూనియర్ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా ఎస్‌ఎస్‌ రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ మూవీ కోసం కోసం ఫ్యాన్స్‌తోపాటు ప్రముఖులు సైతం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. RRR ఒక్కో పోస్టర్‌ను విడుదల చేస్తూ రాజమౌళి అంచనాలను పెంచేశారు. తాజాగా ఈ మూవీపై హీరోయిన్‌ పూజా హెగ్డే కీలక వ్యాఖ్యలు చేసింది. రాజమౌళి RRR ఎమోషనల్‌ డ్రైవ్‌ను చూడటానికి ఎంతో ఆసక్తితో వెయిట్‌ చేస్తున్నా.. ఎన్టీఆర్‌, చరణ్‌ ఇద్దరూ ఫెంటాస్టిక్‌గా కనిపిస్తున్నారు. ఇద్దరినీ బిగ్‌ స్క్రీన్‌పై చూడటానికి వెయిట్‌ చేస్తున్నా అని పూజా హెగ్డే పేర్కొంది.

కాగా, ఈ మూవీలో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ, కొమురం భీమ్‌గా తారక్‌ కనిపించనున్నారు. ఈ మూవీని దాదాపు రూ. 450 కోట్లపైగా బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్‌ ఆలియా భట్ ఈ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇక తారక్‌కు జోడీగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ నటించారు. ఈ మూవీకి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 7న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్‌ చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి.