NTV Telugu Site icon

సీరియ‌ల్ కిల్ల‌ర్ గా సుహాస్!

సుహాస్ అంటే అందరికీ తెలిసింది కమెడియన్ గానే! అయితే ఆ మధ్య ‘కలర్ ఫోటో’లో హీరోగా నటించిన సుహాస్ మరికొన్ని చిత్రాల్లో కీలక పాత్రలు కూడా పోషించాడు. తాజాగా అతను నటిస్తున్న ‘ఫ్యామిలీ డ్రామా’ మూవీ ట్రైలర్ గురువారం విడుదలైంది. ఇప్పటికే ఈ మూవీ పోస్టర్స్ జనాల్లో ఆసక్తిని కలగచేయగా, లేటెస్ట్ ట్రైలర్ వాళ్ళను ఓ రకంగా షాక్ కు గురిచేసింది. ఈ మూవీలో సుహాస్ సీరియల్ కిల్లర్ గా నటిస్తుండమే దానికి కారణం. మెహర్ తేజ్ డైరెక్షన్ స్కిల్స్, సుహాస్ పెర్ఫార్మెన్స్, అజయ్ అండ్ సంజయ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ ట్రైలర్ ను మరో లెవెల్ కు తీసుకెళ్ళాయి. రేపు థియేటర్లలో ఈ మూవీ విడుదలైన తర్వాత ఆడియెన్స్ కి ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్ పీరియన్స్ ను ఇది కలగచేస్తుందనే భావన ఈ ట్రైలర్ చూస్తే అర్థమైపోతోంది.

Read Also: రాజ్ కుంద్రా తరపు లాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఈ సైకో థ్రిల్లర్ క్రైమ్ డ్రామాకు కథ, స్క్రీన్ ప్లేను మెహర్ తేజ్, షణ్ముఖ ప్రశాంత్ అందిస్తున్నారు. దీన్ని మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో మెహె‌ర్ తేజ్‌, తేజా కాస‌ర‌పు నిర్మిస్తున్నారు. తేజ కాసారపు, పూజా కిరణ్, అనుషా నూతుల, శ్రుతి మెహర్, సంజయ్ రథా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘ఫ్యామిలీ డ్రామా’కు వెంకట్ ఆర్ శాఖమూరి సినిమాటోగ్రాఫర్.

Family Drama Movie Trailer 4K | Suhas | Teja Kasarapu | Pooja Kiran | Meher Tej | Telugu FilmNagar