Site icon NTV Telugu

రాజమాత శివగామి ‘ఆమె’ విషయంలో అన్యాయమైన తీర్పునిచ్చిందా?

రాజమాత శివగామి విమర్శల పాలైంది! అదీ ఎవరో మామూలు వ్యక్తి ఆమెని టార్గెట్ చేయలేదు. నటి మంజుల పెద్ద కూతురు వనితా విజయ్ కుమార్ రమ్యకృష్ణని ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేసింది. వనితా అప్పుడెప్పుడో మన తెలుగు చిత్రం ‘దేవి’లో కూడా నటించింది. అయితే, తమిళంలో ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ‘బిబి జోడిగళ్’ డ్యాన్స్ షోలో ఆమె కూడా ఒక కంటెస్టెంట్. బిగ్ బాస్ లో పాల్గొన్న వాళ్లతో ‘బిబి జోడిగళ్’ డ్యాన్స్ కాంపిటీషన్ నడుస్తోంది. అందులో రమ్యకృష్ణ ఒక జడ్జ్ గా వ్యవహరిస్తోంది.

వనితా విజయ్ కుమార్ చేసిన ఒక పర్ఫామెన్స్ కి రమ్యకృష్ణ పదికిగానూ ఒక్క పాయింట్ ఇచ్చిందట! అంత దారుణంగా మార్కులివ్వటంతో వనితా షో నుంచీ బయటకు వచ్చేసింది. తాను ‘బిబి జోడిగళ్’ నుంచీ అర్ధాంతరంగా తప్పుకోటానికి ఓ సీనియర్ లేడీ ఆర్టిస్ట్ కారణం అంటూ వనితా ఆరోపించింది. సదరు షోలో అందరికంటే సీనియర్ ఫీమేల్ ఆర్టిస్ట్ రమ్యకృష్ణే. దాంతో అందరూ ప్రస్తుతం ఆమె వైపే చూస్తున్నారు.

రమ్యకృష్ణని వనితా విజయ్ కుమార్ ఆరోపణల గురించి మీడియా అడగగా… ‘’ఆ డ్యాన్స్ షోలో ఏం జరిగిందో మీరు వనితానే ప్రశ్నించండి. నన్ను కాదు’’ అంటూ సమాధానం ఇచ్చిందట. రమ్య మాట తీరు చూస్తుంటే వనితా వ్యవహారాన్ని లైట్ గా తీసుకున్నట్టే కనిపిస్తోంది!

Exit mobile version