Site icon NTV Telugu

తెరపైకి దాసరి బయోపిక్.. ప్రకటన

ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లలో బయోపిక్ లకు మంచి ఆదరణ లభిస్తోంది. ఆయా రంగాల్లో రాణించిన ప్రముఖుల జీవితాల ఆధారంగా బయోపిక్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఇక టాలీవుడ్ దర్శక దిగ్గజం, దర్శకరత్న దాసరి నారాయణరావు బయోపిక్ వస్తుందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన బయోపిక్ పై ఓ ప్రకటన వచ్చింది.

ప్రముఖ దర్శకుడు ధవళ సత్యం దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో దాసరి బయోపిక్ నిర్మించేందుకు నిర్మాత తాడివాక రమేష్ నాయుడు ముందుకొచ్చారు. ఈ బయోపిక్ కి ‘దర్శకరత్న’ అనే టైటిల్‌ని కన్ఫమ్‌ చేశారు. ఇమేజ్ ఫిల్మ్స్ పతాకంపై అతి త్వరలో సెట్స్ కు వెళ్లనుంది. ఈ బయోపిక్ లో ఓ ప్రముఖ హీరో దాసరి పాత్రను పోషించనున్నారు. పూర్తి నటీనటుల వివరాలను అతి త్వరలో ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు. అంతేకాదు, దాసరి స్మారకార్ధం ‘దాసరి నారాయణరావు నేషనల్ ఫిల్మ్ & టివి నేషనల్ అవార్డ్స్’ ప్రదానం చేసేందుకు నిర్మాత తాడివాక రమేష్ సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version