‘స్టార్ మా డాన్స్ ప్లస్’ లో హీట్ పెంచుతున్న ఫైనలిస్టులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని నెలలుగా స్టార్ మాలో జరుగుతున్న స్టార్ మా డ్యాన్స్ + పోటీలు తుది దశకు చేరుకున్నాయి. ఈ నెల 23న జరుగబోతున్న ఫైనల్స్ లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రతి ఒక్క గ్రూప్ పోటాపోటీగా ప్రాక్టీస్ చేసి, టైటిల్ ను దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ రోజు రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే డాన్స్ ప్లస్ ఫైనల్ పోటీతో పాటుగా రేపు (ఆదివారం) సాయంత్రం 6.00 గం.లకు ప్రసారమయ్యే గ్రాండ్ ఫినాలే వీక్షించడం ద్వారా 20 లక్షల రూపాయల బహుమతితో పాటు విజేతగా నిలిచేది ఎవరో తెలియనుంది. గత 21 వారాలుగా జరిగిన ఈ కార్యక్రమంలో ఐదు టీమ్స్ ఫైనల్స్ కు చేరుకున్నాయి.
అందులో మొదటిది వాసి టోనీ (యశ్వంత్ మాస్టర్ టీమ్). భారత దేశం తరఫున అంతర్జాతీయ వేదికలలో పాల్గొనాలనే లక్ష్యంతో తాము కృషి చేస్తున్నామని ఈ బృందంలోని వారు చెబుతున్నారు. ఓంకార్ ప్రోత్సాహం, యశ్వంత్ మాస్టర్ తోడ్పాటుతో ఫైనల్స్ కు చేరామన్నది వాసి టోనీ మాట. ఇక రెండవది సంకేత్ సహదేవ్ (యశ్వంత్ మాస్టర్ టీమ్). ఇండియాలో నంబర్ వన్ కొరియోగ్రాఫర్ గా నిలవాలన్నదే తన లక్ష్యం అని చెబుతున్న సంకేత్ సహదేవ్, తన చివరి శ్వాసవరకూ నృత్యంతో వీక్షకులను రంజింపచేస్తానని హామీ ఇస్తున్నాడు.
ఇక మూడోది మహేశ్వరి – తేజస్విని. (బాబా మాస్టర్ టీమ్). గత 13 సంవత్సరాలుగా మంజుల రామస్వామి గారి దగ్గర భరత నాట్యం నేర్చుకుంటున్న తాము సంప్రదాయ నృత్య రీతులను వీక్షకులకు చూపాలనుకున్నామని, అది నెరవేరడంతో పాటు ఫైనల్స్ కు చేరడం ఆనందంగా ఉందని చెబుతున్నారు. ఇక నాలువది జియా ఠాకూర్ (అనీ మాస్టర్ బృందం). ఈ డాన్స్ ప్లస్ షోలో పాల్గొనడం జీవితకాలం అనుభవం అంటున్నారు జియా ఠాకూర్. మొదటిలో లిరికల్, హిప్ హాప్ మాత్రమే తెలిసిన తనకు జానపదంతో పాటు సమకాలీన వైల్డ్ లిరికల్, రోబోటిక్స్, చార్లీ చాప్లిన్ స్టైల్ వంటివి నేర్చుకునే అవకాశం ఈ షో ద్వారా లభించిందని తెలిపారు. ఇక ఐదవది రఘు మాస్టర్ నేతృత్వంలోని డార్జిలింగ్ డెవిల్స్. లెజెండరీ డాన్సర్స్ సమక్షంలో ప్రదర్శనలివ్వడం గొప్ప అదృష్టమని వీరు చెబుతున్నారు. అంతర్జాతీయంగాను భారీ ప్రదర్శనలు ఇవ్వగలమనే నమ్మకం ఈ షో ద్వారా కలిగిందని అంటున్నారు. మరి ఇవాళ, రేపు జరిగే, ఫైనల్స్ లో ఎవరు విజేతగా నిలిచి వీక్షకుల మనసులు దోచుకుంటారో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!