బిగ్ బాస్ తెలుగు సీజన్ 5కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. పార్టిసిపెంట్స్ ను ఇప్పటికే ఎంపిక చేసిన షో నిర్వాహకులు, వారితో అగ్రిమెంట్స్ కుదుర్చుకుంటున్నారని తెలుస్తోంది. దాంతో సహజంగా ఈసారి షోకు ఎవరు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారనే చర్చ ఒకటి మొదలైంది. యంగ్ టైగర్ ఎన్టీయార్ తో బిగ్ బాస్ సీజన్ 1 షురూ అయ్యింది. ఆ తర్వాత రెండో సీజన్ పగ్గాలను నేచురల్ స్టార్ నాని తీసుకున్నాడు. ఇక మూడు, నాలుగు సీజన్స్ ను నల్లేరు మీద బండి నడకలాగా నాగార్జున నడిపేశారు. ఈ సారి కూడా ఆయనే హోస్ట్ చేస్తారన్నది నిన్న వరకూ అందరూ అనుకుంటున్న మాట. అయితే… తాజాగా ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్న రూమర్ ఏమంటే… బిగ్ బాస్ సీజన్ 5ను రానా చేయబోతున్నాడట. ఇందులో వాస్తవం ఎంత ఉందనేది తెలియదు కానీ, రానా అయితే, బిగ్ బాస్ షోను రక్తి కట్టిస్తాడనే నమ్మకం చాలామందిలో ఉంది. ఇప్పటికే ‘నెంబర్ వన్ యారీ’ వంటి సక్సెస్ ఫుల్ ప్రోగ్రామ్ రెండు సీజన్స్ చేసిన అనుభవం రానా కు ఉంది. అలానే సోషల్ మీడియాలోనూ రానా యమా యాక్టివ్. అతనిలో సూపర్ స్పాంటేనిటీ ఉందని మిత్రులు చెబుతుంటారు. మరి ఈ వార్తలు నిజమై, రానా ‘బిగ్ బాస్’ సీజన్ 5ను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తే మాత్రం ఆ ఫ్రెష్‌నెస్ కారణంగా మరింత మంది యువత ఈ షో పట్ల ఆకర్షితులయ్యే ఛాన్స్ ఉంది.
నాగార్జున స్థానంలోకి రానా!
