Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Birthday Girl Avika Gor Shares A Glimpse Of Her Upcoming Movies

అవికా గోర్ బర్త్ డే హంగామా మామూలుగా లేదుగా!

Published Date :June 30, 2021 , 3:27 pm
By ramakrishna
అవికా గోర్ బర్త్ డే హంగామా మామూలుగా లేదుగా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

‘బాలికా వధు’ టీవీ సీరియల్ తెలుగు అనువాదం ‘చిన్నారి పెళ్ళికూతురు’తో మనవాళ్ళకు బాగా చేరువై పోయింది అవికా గోర్. ఆమె హీరోయిన్ గా నటించిన తొలి చిత్రం ‘ఉయ్యాల జంపాల’ చక్కని విజయాన్ని అందుకోవడంతో అవికా వెనుదిగిరి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత ఆమె నటించిన ‘సినిమా చూపిస్త మావా’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రాలూ సక్సెస్ సాధించాయి. విశేషం ఏమంటే… ఇప్పుడు అవికా గోర్ చేతిలో దాదాపు ఏడెనిమిది సినిమాలు ఉన్నాయి. అందులో ఆమె హీరోయిన్ గా నటిస్తున్న సినిమాలే ఆరు కావడం విశేషం. ఇవాళ అవికా గోర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న సినిమాల దర్శక నిర్మాతలు బర్త్ డే విషెస్ తెలియచేస్తూ పోస్టర్స్, మోషన్ పోస్టర్స్, గ్లిమ్స్ విడుదల చేశారు. ఇందులో కొన్ని సినిమాలకు అవికా గోర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం.

అవికా గోర్ నటిస్తున్న సినిమాల వివరాల్లోకి వెళితే, చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా గీతా ఆర్ట్స్ 2, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఫిలిమ్స్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రచయిత శ్రీధర్ సీపాన దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో అవికా హీరోయిన్ గా నటిస్తోంది. అవికా బర్త్ డే గ్లిమ్స్ ను టీమ్ విడుదల చేసింది. అలానే ఆది సాయికుమార్ హీరోగా బలవీర్ దర్శకత్వంలో ఎస్వీఆర్ ‘అమరన్’ పేరుతో ఓ సినిమా నిర్మిస్తున్నారు. చాప్టర్ 1, ఇన్ ది సిటీ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో అవికా గోర్ హీరోయిన్. ఇక సత్యకృష్ణ ప్రొడక్షన్స్ సంస్థ హేమంత్ దర్శకత్వంలో నిర్మించే సినిమాకు సత్యకృష్ణ, అవికాగోర్ నిర్మాతలు వ్యవహరించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలు కానుంది.

సాయిరోనక్ హీరోగా మురళీ గంథం దర్శకత్వంలో భోగేంద్ర గుప్తా ‘పాప్ కార్న్’ పేరుతో ఓ సినిమా నిర్మిస్తున్నారు. శ్రావణ్‌ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను అవికా గోర్ బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు. ఈ సినిమాకూ అవికా గోర్ సహ నిర్మాతగా ఉన్నారు. నవీన్ చంద్ర, అవికాగోర్ జంటగా కార్తీక్ తిపురని దర్శకత్వంలో యలమంచి రవిచంద్ ఓ సినిమా నిర్మిస్తున్నారు. దీనికి శేఖర్ చంద్ర సంగీతదర్శకుడు. అనురాగ్ కొణిదెల హీరోగా సత్యం ద్వారపూడి దర్శకత్వంలో కె. కోటేశ్వరరావు నిర్మిస్తున్న సినిమాలోనూ అవికా గోర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది కాకుండా ‘దిల్’ రాజు… విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘థ్యాంక్యూ’ మూవీలో నాగచైతన్య, రాశిఖన్నాతో పాటు అవికా గోర్ సైతం నటిస్తోంది. ఆ రకంగా ఇటు నటిగా, నిర్మాతగా కూడా అవికా గోర్ ఫుల్ బిజీగా ఉండిపోయింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Avika Gor
  • Avika Gor Updates
  • Avika upcoming movies
  • Birthday girl Avika Gor
  • glimpse

తాజావార్తలు

  • PM Modi-Trump call: పీఎం మోడీ-ట్రంప్ మధ్య “ఇరాన్” చర్చ.. మధ్యలో ఎలాన్ మస్క్ ఎంట్రీ..

  • New Scheme In Telangana: తెలంగాణలో మరో కొత్త స్కీమ్ ప్రారంభం.. సీఎం చేతుల మీదుగా..

  • Harish Rao : హైదరాబాద్ లో పెద్దఎత్తున మైనింగ్ జరుగుతోంది..

  • Amit shah: ఎన్నికల సమయంలోనే బాధితురాలిగా నటిస్తుంది.. మమతపై అమిత్ షా విమర్శలు

  • Akhil Raj: “రాజు వెడ్స్ రాంబాయి” హీరో ఇల్లు ఎలా ఉందో చూశారా?

ట్రెండింగ్‌

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • 120Hz డిస్‌ప్లే + 6300mAh బ్యాటరీ.. కేవలం రూ. 12,999లే.. కొత్త REDMI 15A 5G లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions