NTV Telugu Site icon

BB6: గీతూ ‘నోటిదూల’పై సుదీర్ఘ చర్చ!

BIGGBOSS Mouthful

83813d1f 7bf4 4102 B9da 4d38ffee3fc7

బిగ్ బాస్ షోలో గీతూ రాయల్ నోటి దూలపై శనివారం సుదీర్ఘమైన చర్చ జరిగింది. చిత్రంగా దీనిపై శుక్రవారమే గీతూ సెల్ఫ్ ఎనలైజేషన్ మొదలు పెట్టింది. ఆదిరెడ్డి పక్కన కూర్చుని ‘నాది నోటి దూలా?’ అని ప్రశ్నించింది. అలానే శ్రీహాన్ నూ అదే ప్రశ్న అడిగింది. ఆమె మాట తీరు కారణంగా దాన్ని చాలామంది నోటి దూల అనుకుంటున్నారు కానీ అలాంటిదేమీ లేదని వారు వివరణ ఇచ్చారు. ‘నాదే నోటిదూల అయితే… మరి రేవంత్, ఇనయా మాట్లాడేది ఏమిటీ?’ అంటూ గీతూ… ఎదురు ప్రశ్నించింది. ఆ మర్నాడు నాగార్జున సైతం ఇదే విషయాన్ని చర్చకు పెట్టారు. గీతూది నోటి దూల అతి తేల్చారు.

Read Also: Bigg boss 6: నాగార్జున, నారాయణ మధ్య ఆగని మాటల పోరు!

ఎదుటి వ్యక్తి తన అభిప్రాయం చెబుతుండగా, మధ్యలో ‘దొబ్బేయ్’ అని అనడాన్ని ‘నోటి దూల’ అనే అంటారని నాగార్జున అన్నాడు. అయితే దానికీ గీతూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఒక మీదట అయినా నోరును అదుపులో పెట్టుకుంటే బెటర్ అంటూ నాగ్ గీతూకు సజెషన్ ఇచ్చారు. ఇదే అంశంపై నాగార్జున ఇనయాకూ క్లాస్ పీకాడు. ఎవరిని పడితే వారిని ‘వాడు’ అని అనడం కరెక్ట్ కదాని, ఎదుటివారితో మనకున్న చనువును బట్టీ మాట్లాడాల్సి ఉంటుందని హితవు పలికాడు. ఇక మూడోవారం ఎలిమినేషన్స్ లో తొమ్మిది ఉండగా… నాలుగోవారానికి సంబంధించిన బిగ్ బాస్ షోలోనే మొదటిసారి… నాగార్జునకు ఇద్దరిని ఎలిమినేట్ చేసే ఛాన్స్ దక్కింది. దాంతో అందరి ఆట తీరునూ పరిశీలించిన నాగార్జున డైరెక్ట్ గా నాలుగో వారానికి అర్జున్ కళ్యాణ్‌, కీర్తి భట్ ను నామినేట్ చేశాడు.

Read Also: Chennakesava Reddy: ఇరవై ఏళ్ళ ‘చెన్నకేశవ రెడ్డి’