Site icon NTV Telugu

ఏపీలో సినిమా టికెట్ ధరల వివాదంపై స్పందించిన బాలకృష్ణ

Balakrishna

Balakrishna

ఇటీవల నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అఖండ. ఈ సినిమా అఖండ విజయాన్ని సొంత చేసుకుంది. ఈ నేపథ్యంలో అఖండ చిత్రయూనిట్‌ థాంక్స్‌ మీట్‌ను నిర్వహించాయి. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ… అన్ సీజన్ లో అఖండ విడుదల చేశామని, అఖండ పాన్ ఇండియా సినిమానే కాదు పాన్ వరల్డ్ సినిమాగా మారిందని ఆయన అన్నారు.

పాకిస్థాన్‌లో కూడా అఖండ చెలరేగిపోతుందని, అక్కడి నుంచి వాట్సప్ వీడియోలు వస్తున్నాయన్నారు. అంతేకాకుండా ఏపీలో సినిమా టికెట్ ధరల వివాదంపై స్పందించిన బాలకృష్ణ.. ఏపీలో సినీ పరిశ్రమ వివాదంపై కలిసికట్టుగా ఉండాలన్నారు. టికెట్ ధరలపై సినీ పరిశ్రమ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, సినిమా గోడును అక్కడ పట్టింకునే వాళ్లు ఎవరున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

Exit mobile version