NTV Telugu Site icon

అదిరిపోయే వర్కవుట్స్‌తో అల్లు శిరీష్

కళ్లు చెదిరే ఫిజిక్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు అల్లు శిరీష్. వర్కవుట్స్ ఎలా చేయాలి? ఫిట్‌గా ఎలా ఉండాలి? అనే విషయంపై ఇప్పుడు ఈ హీరో అందరికీ తన వీడియోల ద్వారా మోటివేషన్ ఇస్తున్నాడు. అలాగే తన వర్కవుట్స్ ఎలా సాగుతున్నాయో తెలియచేస్తూ, ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం తాను చేసిన ప్రయత్నంలోని ప్రయాణం గురించి ఓ వీడియోను విడుదల చేసారు శిరీష్. ట్రైనింగ్ డే పేరుతో సోషల్ మీడియాలో అల్లు శిరీష్ ఓ ఫిట్ నెస్ వీడియోను అప్‌లోడ్ చేశాడు. దీనికి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. తొలి వీడియోలో బ్యాక్ వర్కవుట్స్ గురించి చూపించారు. జిమ్‌లో తాను ఎంత కష్టపడ్డాడు అనేది ఈ వీడియోలో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది.

Read Also: ‘తలైవి’కి తమిళంలో ‘యు’ సర్టిఫికెట్!

ఈ వీడియోలో ముందుగా వామప్ చేసిన తర్వాత.. ఒక్క చేతితో డంబెల్స్ లిఫ్ట్ చేయడం చూడొచ్చు. 30 సెకన్ల ఈ వీడియోలో జిమ్‌కు సంబంధించిన ఇంకా చాలా అంశాలు చూపించారు. ఈ వర్కవుట్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి.. దాంతో పాటు అభిమానుల కోసం మనసులో మాట రాసుకొచ్చారు అల్లు శిరీష్. తన వర్కవుట్ షెడ్యూల్‌లో చాలా రకాల ఫిట్ నెస్ సూత్రాలు దాగున్నాయని చెప్పిన శిరీష్, ఈ డిజిటల్ సిరీస్‌లో జిమ్ ట్రైనింగ్, ఫిట్‌నెస్ మాత్రమే కాకుండా యోగా, బాక్సింగ్‌కు సంబంధించిన విషయాలు కూడా చూపిస్తానంటున్నాడు.

View this post on Instagram

A post shared by Allu Sirish (@allusirish)