కామెడీ చిత్రాలతో కడుపుబ్బా నవ్వించిన నేటి తరం కామెడీ స్టార్ అల్లరి నరేష్. కామెడీ చిత్రాలే కాదు… ‘విశాఖ ఎక్స్‌ప్రెస్, గమ్యం, నాంది, మహర్షి’ వంటి వైవిధ్యమైన కథాంశాలున్న చిత్రాల్లోనూ నటించి నటుడిగా మెప్పించారాయన. ‘అల్లరి’ నరేష్, ఆనంది హీరో హీరోయిన్లుగా ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణ, నిర్మాణంలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ నిర్మాతగా కొత్త చిత్రం సోమవారం లాంఛనంగా పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ చిత్రానికి ఎ.ఆర్.మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలాజీ గుత్త సహ నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి బాలు మున్నంగి క్లాప్‌ను కొట్టగా, అభిషేక్ అగర్వాల్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనిల్ సుంకర గౌరవ దర్శకత్వం వహించారు. వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అబ్బూరి రవి మాటలను అందిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం సమకూర్చుతున్నారు.
అల్లరి నరేష్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం
