Site icon NTV Telugu

Allari Naresh : ‘బచ్చలమల్లి’ గాడిగా వస్తున్న అల్లరి నరేష్..

Baccalapalli

Baccalapalli

టాలివుడ్ హీరో అల్లరి నరేష్ సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత సరికొత్త టైటిల్స్, డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.. ఇప్పటివరకు వచ్చిన అన్నీ సినిమాలు ప్రేక్షకులను బాగా మెప్పించాయి.. ఇటీవల ‘నాంది’ సినిమా నుంచి వైవిధ్యమైన కథలతో, వైవిధ్యమైన టైటిల్స్ తో వస్తున్నాడు. ఇన్నాళ్లు కామెడీతో అందర్నీ నవ్వించిన అల్లరి నరేష్ నాంది నుంచి తనలోని ఎమోషన్ ని, సీరియస్ నటుడ్ని చూపిస్తున్నాడు..

ఇక ఈ మధ్య నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం సినిమాలతో వరుసగా హ్యాట్రిక్ కొట్టిన అల్లరి నరేష్ త్వరలో ‘సభకు నమస్కరం’ సినిమాతో రాబోతున్నాడు.. ఈ సినిమా అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది.. ఇప్పుడు తాజాగా తన 63 వ సినిమాను అనౌన్స్ చేశారు.. దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో, హాస్య మూవీస్ నిర్మాణంలో ప్రకటించారు. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. అలాగే నరేష్ 63వ సినిమా టైటిల్ ప్రకటిస్తూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు..

ఆ సినిమా ‘బచ్చలమల్లి’ అనే సరికొత్త టైటిల్ ప్రకటించారు. ఈ పోస్టర్ లో ట్రాక్టర్ మీద నుంచి కొన్ని బస్తాలు ఎగిరి పడుతున్నట్టు ఉంది. ఈ సినిమా కూడా నరేష్ ఇటీవల చేస్తున్న సినిమాల్లాగే ఉండొచ్చు అనిపిస్తుంది. దీంతో ఈ సినిమాపై కూడా అంచనాలు నెలకొన్నాయి.. ఈ సినిమా పూజా కార్యక్రమాలకు డైరెక్టర్ మారుతి, అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా వచ్చారు. మరి ఈ ‘బచ్చలమల్లి’ సినిమాతో నరేష్ ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి..

Exit mobile version