త్రీడీ లో అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘బెల్ బాటమ్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 19న విడుదల కాబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రెండు రోజుల క్రితమే వచ్చింది. అయితే… ‘బెల్ బాటమ్’ విషయంలో ‘అంతకుమించి..’ అంటున్నారు నిర్మాతలు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 19న త్రీడీలోనూ రిలీజ్ చేయడానికి చిత్ర నిర్మాణ సంస్థ పూజా ఎంటర్ టైన్ మెంట్ సన్నాహాలు చేస్తోంది. అక్షయ్ కుమార్ సరసన వాణీ కపూర్, లారాదత్త, హుమా ఖురేషీ నటిస్తున్న ఈ చిత్రాన్ని రంజిత్ ఎం తివారీ తెరకెక్కించారు. కరోనా సమయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుని ఈ సినిమాను శరవేగంగా చిత్రీకరించారు.
అయితే… కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల విషయంలో తీవ్ర జాప్యం జరిగింది. కానీ సినిమాకు ఏర్పడిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని దీనిని ఓటీటీలో కాకుండా థియేటర్లలోనే విడుదల చేయాలని పూజా ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ భావించింది. థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ను రెట్టింపు చేసేందుకు 2డీతో పాటు 3డీ వెర్షన్ ను కూడా ఎంపిక చేసిన థియేటర్లలో ప్రదర్శించాలనే నిర్ణయానికి నిర్మాణ సంస్థ వచ్చింది. మరి కొవిడ్ 19 థర్డ్ వేవ్ గురించి భయాందోళనలు చెందకుండా ఎంత మంది థియేటర్ కు వచ్చి ఈ సినిమాను చూస్తారో! వేచి చూడాలి!!
Also Read
- VRK Rao : పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నిర్మాత మనవరాలు
- Toxic Fan Culture: అభిమానమా? ఉన్మాదమా? ఉ*గ్రవాదమా? ఎక్కడపడితే అక్కడ టచ్ చేస్తారా?
- Anaganaga Australia Lo Review: 'అనగనగా ఆస్ట్రేలియాలో' రివ్యూ!
- Pushpa 2 Special Song: 'పుష్ప-2 ది రూల్'లో మాసివ్ ''కిస్సిక్'' సాంగ్ కోసం డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల
- Tags
- 3D
- Akshay Kumar
- Bell Bottom
తాజావార్తలు
-
Peddi: పెద్ది టార్గెట్ పెద్దదే.. కానీ?
-
Team India Series: భారీ సిరీస్‌కు సిద్ధంగా టీమిండియా.. అందరి దృష్టి ఈ లెజెండ్స్పైనే.. ఇదే లాస్ట్..
-
Dhanush Political Entry: విజయ్‌కు పోటీగా ధనుష్ పాలిటిక్స్ ఎంట్రీ?
-
Trinamool Congress: మమతా బెనర్జీ సంచలన నిర్ణయం.. ఇలా చేసిందేంటి..
-
DSC Candidates: డీఎస్సీ నియామకాల్లో అన్యాయం.. జగన్‌కు ఫిర్యాదు చేసిన అభ్యర్థులు
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!