NTV Telugu Site icon

‘ఓడిద్దాం’ అంటోన్న చిరంజీవి, అక్షయ్ కుమార్!

కరోనా వచ్చింది. కొంచెం వెనక్కి తగ్గింది. జనం కాస్త రిలాక్స్ అయ్యారు. అందుకే, సెకండ్ వేవ్ తో కల్లోలం సృష్టించింది. ఇక ఇప్పుడు ఎలాగో నానా తంటాలు పడి రెండో కరోనా తుఫానుని కూడా తగ్గించగలిగాం. కానీ, స్టోరీ ఇంతటితో ముగిసిపోలేదు. ‘హర్ ఘర్ నే థానా హై, కరోనా కో హరానా హై’ అంటున్నారు మన చిరంజీవి, బాలీవుడ్ స్టార్ అక్షయ్, తమిళ స్టార్ ఆర్య, కన్నడ పవర్ స్టార్ పూనీత్ రాజ్ కుమార్!
‘ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ (ఫిక్కీ) కరోనాకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నడుం బిగించింది. సెకండ్ వేవ్ క్రమంగా క్షిణిస్తున్నప్పటికీ ముందు ముందు మరింత జాగ్రత్తగా ఉండాలంటూ హిందీ, మరాఠీ, పంజాబీ, తెలుగు, తమిళం, కన్నడ వంటి భాషల్లో ప్రచారం చేయనున్నారు. ఇందుకుగానూ మెగాస్టార్ చిరంజీవి, ‘ఖిలాడీ’ అక్షయ్ కుమార్, ఆర్య, పూనీత్ రాజ్ కుమార్ లాంటి పాప్యులర్ హీరోలతో క్యాంపైన్ ప్రాంభించారు. జూన్ 5 నుంచీ టీవీ, పేపర్, ఇంటర్నెట్ లాంటి మాస్ మీడియా ప్లాట్ ఫామ్స్ పైన స్పెషల్ కరోనా అవేర్ నెస్ యాడ్స్ ప్రసారం అవుతాయి. హిందీ, మరాఠీ, పంజాబీ భాషల్లో అక్షయ్ కుమార్ ‘కరోనా కో హరానా హై’ అంటే… తమిళంలో ఆర్య, కన్నడలో పూనీత్ రాజ్ కుమార్ తమ ప్రజలకి మహమ్మారిని ఓడిద్దాం అంటూ సందేశం ఇస్తారు. ఇక తెలుగులో చిరంజీవి ఫిక్కీ తరుఫున ప్యాండమిక్ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో చెప్పనున్నారు!