Site icon NTV Telugu

పేరెంట్స్ కోసం నాని కోవిడ్ అవేర్ నెస్

కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ప్రస్తుతం ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా షూటింగ్ మొదలెట్టేశాడు నాని. అంతేకాదు దాని తర్వాత మరికొన్ని ప్రాజెక్ట్ లను కూడా లైన్ లో పెట్టాడు. ఇంత బిజీటైమ్ లో కూడా నాని ప్రజల్లో కోవిడ్ అవేర్ నెస్ క్రియేట్ చేయటానికి తాపత్రయపడుతున్నాడు. గతనెలలో కోవిడ్ యుద్ధంలో వీరసైనికుల్లా పోరాడుతున్న డాక్టర్ల కోసం ఓపాటను విడుదల చేసిన నాని ఇప్పుడు కోవిడ్ మూడో వేవ్ పిల్లలను బలంగా తాకుతుందని బలంగా వినిపిస్తున్న తరుణంలో పేరెంట్స్ కోసం స్పెషల్ ఎవేర్ నెస్ వీడియోను విడుదల చేశాడు. ఈవీడియోలో ప్రముఖ పెడియాట్రీసియన్ డాక్టర్ శివరంజని సంతోష్ ని నాని స్వయంగా పేరెంట్స్ తరపున పాండమిక్ గురించి కొన్ని ప్రశ్నలు అడిగాడు. గందరగోళంలోఉన్న చాలా మంది తల్లిదండ్రులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు.

Exit mobile version