40 ఏళ్ళ ‘ప్రేమకానుక’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(జూన్ 27తో ‘ప్రేమకానుక’కు 40 ఏళ్ళు)
నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 1981లో ‘ప్రేమాభిషేకం’తో జైత్రయాత్ర సాగించారు. అన్నపూర్ణ సినీస్టూడియోస్ పతాకంపై తెరకెక్కిన ‘ప్రేమాభిషేకం’ దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందింది. అదే పతాకంపై కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అదే ఏడాది వచ్చిన చిత్రం ‘ప్రేమకానుక’. ‘ప్రేమ’ అన్న మాట ఏయన్నార్ కు భలేగా అచ్చివచ్చిందనే చెప్పాలి. అదే తీరున ‘ప్రేమకానుక’లోనూ ప్రేమ చోటుచేసుకుంది. అక్కినేని సోలో హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించిన చిత్రం ఇదొక్కటే అని చెప్పవచ్చు.
Also Read
ఇందులో హీరో రాజశేఖర్ ఓ పెయింటర్ గా ఓ ఊరికి వెళతాడు. గౌరీ అనే ఓ అందమైన అమ్మాయి బొమ్మలు గీస్తాడు. అది నచ్చని ఆ ఊరి షావుకారు జంతువుల జగన్నాథమ్ కూతురు సంధ్య పెయింటింగ్స్ ను పాడు చేస్తుంది. రాజశేఖర్ గత జన్మలో తాను సంధ్య ప్రేమించుకున్నామని, అందుకే ఇప్పుడు ఇలా కలుసుకున్నామని చెబుతాడు. రాజా, సంధ్య ప్రేమించుకుంటారు. జగన్నాథమ్ మేనల్లుడు మోహన్ నీచుడు. అతను ఎలాగైనా సంధ్యను తనదానిగా చేసుకోవాలని చూస్తుంటాడు. రాజా వల్ల సంధ్య గర్భవతి అవుతుంది. రాజాకు గౌరీకి సంబంధం ఉందని చూపిస్తారు జగన్నాథమ్ అండ్ కో. అపార్థం చేసుకున్న సంధ్య గర్భస్రావానికి పాలు పడుతుంది. అప్పుడు రాజా తన మతిస్థిమితం లేని అక్కను చూపిస్తాడు. ఆమె అలా కావడానికి కారకుడు జగన్నాథమే అని చెబుతాడు. తన తండ్రి నీచత్వం తెలుసుకున్న సంధ్య, రాజాకు సహకరిస్తుంది. గౌరీని మోహన్ రేప్ చేస్తాడు. అతణ్ణి చట్టానికి పట్టిస్తాడు రాజా. జగన్నాథమ్ తనను క్షమించమంటాడు. చివరకు రాజా సీబీఐ ఆఫీసర్ అని తెలుస్తుంది. మోహన్ ను పట్టుకోవడం కోసమే పెయింటర్ గా రాజా అవతారమెత్తి ఉంటాడు. చివరకు రాజా, సంధ్య పెళ్ళితో కథ సుఖాంతమవుతుంది.
‘ప్రేమాభిషేకం’లో జోడీ కట్టి అలరించిన ఏయన్నార్, శ్రీదేవి ఇందులోనూ మరోమారు మురిపించారు. మధుమాలిని, రావుగోపాలరావు, సత్యనారాయణ, మోహన్ బాబు, ప్రభాకర్ రెడ్డి, చలపతిరావు, నర్రా, మనోరమ, సుభాషిణి, మాస్టర్ హరీశ్ నటించారు. గుహనాథన్ కథ అందించిన ఈ చిత్రానికి సత్యానంద్ సంభాషణలు, ఆచార్య ఆత్రేయ పాటలు, చక్రవర్తి సంగీతం సమకూర్చారు. “అయ్యారే తుంటరోడా…”, “ఈ కొండ కోనల్లో…”, “చెమ్మ చెక్కా…”, “వంట చేసి చూపిస్తా…”, “జంతర్ మంతర్…” సాంగ్స్ జనాన్ని ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
తాజావార్తలు
-
Britain Heatwave: భారత్‌లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్‌లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
-
NBK 112: కొరటాల సినిమా కోసం రూల్స్ బ్రేక్ చేసిన బాలయ్య
-
Laundry Tips: వర్షాకాలంలో బట్టలు వాసన వస్తున్నాయా? సింపుల్‌గా ఇలా చేసేయండి!
-
Smartphone Restart Benefits: స్మార్ట్‌ఫోన్‌ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
ట్రెండింగ్
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?