నటి సంజనా గల్రానీ ఆదివారం బెంగళూరులో కొవీషీల్డ్ వాక్సిన్ వేయించుకుంది. ఈ సందర్భంగా అక్కడి వైద్య సిబ్బంది సేవలు చూసి ఫిదా అయిపోయింది సంజనా. వారి అంకిత భావం చూస్తుంటే గర్వంగా ఉందంటూ పొగిడేసింది. అంతేకాదు… ఎవరైనా కొవీషీల్డ్ వాక్సిన్ వేయించుకోవాలనుకుంటే ఉచితంగా అందించడానికి తాను సిద్ధమని, సంజనా ఫౌండేషన్ కు మెయిల్ ద్వారా వివరాలు తెలియచేస్తే వారికి వాక్సిన్ వేయిస్తామని హామీ ఇస్తోంది. ఇటీవల కూడా సంజనా కరోనా బాధితులకు ఆహారాన్ని అందించడంతో పాటు సినీ కార్మికులకు నిత్యావసరాలను అందించింది.
ఫ్రీ గా వాక్సిన్ వేయిస్తానంటున్న సంజనా!
