ప్రముఖ నిర్మాతపై విశాల్ పోలీస్ కంప్లైంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో విశాల్ ప్రముఖ నిర్మాతపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఇప్పుడు కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. విశాల్ ప్రస్తుతం ‘ఎనిమీ’, ‘తుప్పరివాలన్ 2’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. దక్షిణాదిలో తమ చిత్రాలను సొంత బ్యానర్ పై నిర్మించే అతికొద్ది మంది నటులలో విశాల్ ఒకరు. చాలా అరుదుగా మాత్రమే విశాల్ తన చిత్రాలను విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై కాకుండా ఇతర బ్యానర్లలో చేస్తాడు. ఇక విషయానికొస్తే… 2018లో “ఇరుంబుథిరయ్” (తెలుగులో అభిమన్యుడు) చిత్రం కోసం విశాల్ ప్రముఖ ఫైనాన్షియర్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాత ఆర్బి చౌదరి నుంచి తనకు సంబంధించిన కొన్ని డాక్యూమెంట్లు పెట్టి కొంతమొత్తం అప్పుగా తీసుకున్నారు. తరువాత విశాల్ అప్పు మొత్తాన్ని తిరిగి చెల్లించినప్పటికీ తనకు సంబంధించిన చెక్ లు, బాండ్లు, ప్రామిసరీ నోట్లను విశాల్‌కు తిరిగి ఇవ్వలేదట నిర్మాత ఆర్బి చౌదరి. ఆర్బి చౌదరి దగ్గర ఈ విషయమై చాలాసార్లు ప్రస్తావించి విసిగిపోయిన విశాల్ చివరకు పోలీసులను ఆశ్రయించారు. ఈ సీనియర్ నిర్మాతపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్నీ విశాల్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
It’s unacceptable that Mr #RBChoudhary failed to return the Cheque Leaves,Bonds & Promissory Notes months after repaying the loan to him for the Movie #IrumbuThirai,he was evading giving excuses & finally told he has misplaced the documents
Also Read
We have lodged a complaint with Police
— Vishal (@VishalKOfficial) June 9, 2021
- Tags
- RB Choudhary
- Vishal
తాజావార్తలు
-
Dhanush Politics: విజయ్ తర్వాత రాజకీయాల్లోకి ధనుష్?.. బహిరంగ సభతో రాజకీయ ఎంట్రీపై ఊహాగానాలు
-
Student Death: సీఎంతో మాట్లాడిన విద్యార్థిని ఆత్మహత్య.. రంపచోడవరంలో కలకలం!
-
Bhatti Vikramarka: ఏ విద్యార్థి ఆకలితో ఉండకూడదు.. ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం ప్రారంభం.!
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
Bihar Bandh AK-47 Firing: విద్యార్థుల నిరసనలో.. ఏకే-47తో కాల్పులు జరిపిన కానిస్టేబుల్ సస్పెండ్..
ట్రెండింగ్
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Record: జింబాబ్వేపై తుఫాన్ హాఫ్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డు!