Site icon NTV Telugu

ప్రముఖ నిర్మాతపై విశాల్ పోలీస్ కంప్లైంట్

Vishal Lodges Police Complaint Against RB Choudhary

తమిళ స్టార్ హీరో విశాల్ ప్రముఖ నిర్మాతపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఇప్పుడు కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. విశాల్ ప్రస్తుతం ‘ఎనిమీ’, ‘తుప్పరివాలన్ 2’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. దక్షిణాదిలో తమ చిత్రాలను సొంత బ్యానర్ పై నిర్మించే అతికొద్ది మంది నటులలో విశాల్ ఒకరు. చాలా అరుదుగా మాత్రమే విశాల్ తన చిత్రాలను విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై కాకుండా ఇతర బ్యానర్లలో చేస్తాడు. ఇక విషయానికొస్తే… 2018లో “ఇరుంబుథిరయ్” (తెలుగులో అభిమన్యుడు) చిత్రం కోసం విశాల్ ప్రముఖ ఫైనాన్షియర్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాత ఆర్‌బి చౌదరి నుంచి తనకు సంబంధించిన కొన్ని డాక్యూమెంట్లు పెట్టి కొంతమొత్తం అప్పుగా తీసుకున్నారు. తరువాత విశాల్ అప్పు మొత్తాన్ని తిరిగి చెల్లించినప్పటికీ తనకు సంబంధించిన చెక్ లు, బాండ్లు, ప్రామిసరీ నోట్లను విశాల్‌కు తిరిగి ఇవ్వలేదట నిర్మాత ఆర్‌బి చౌదరి. ఆర్‌బి చౌదరి దగ్గర ఈ విషయమై చాలాసార్లు ప్రస్తావించి విసిగిపోయిన విశాల్ చివరకు పోలీసులను ఆశ్రయించారు. ఈ సీనియర్ నిర్మాతపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్నీ విశాల్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

Exit mobile version