కూటమి ప్రభుత్వం లడ్డు విషయాన్ని రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకుంటోందని మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ ఆరోపించారు. సుప్రీం ధర్మాసనం టీటీడీ గురించి కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్న అడ్వకేట్ సిద్ధార్థ్ లోత్రా సమాధానాలు చెప్పలేక చేతులెత్తేశాడు.. సుప్రీంకోర్టు మూడు ప్రశ్నలు అడగడం జరిగింది.. లడ్డూను రజకీయాల్లోకి ఎందుకు తీసుకొచ్చారు?.. కల్తీకి ఆధారాలు మీ వద్ద ఉన్నాయా? తొందరపడి నిర్ణయాన్ని ఎందుకు ప్రకటించారు? అని సుప్రీంకోర్టు ధర్మాసనం అడిగితే రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్నుంచి జవాబు లేదని పేర్కొన్నారు. మన తిరుపతిని, మన దేవస్థానాన్ని కూటమి ప్రభుత్వం బాగా వాడుకుంటోంది.. తాను ఆనాడే చెప్పానని.. చంద్రబాబు లడ్డు విషయంలో మాట్లాడకుండా ఉంటే బాగుండేదని చింతా మోహన్ అన్నారు.
Read Also: Insurance Premium: బీమా పాలసీలకు కొత్త రూల్స్.. ఎప్పట్నుంచి అమల్లోకి అంటే..!
టీటీడీ ఈవో శ్యామల రావు లడ్డు, నెయ్యి విషయంలో తొందరపడ్డారు.. పప్పులో కాలేశాడని విమర్శించారు. గతంలో టీటీడీ ఈవోలుగా పనిచేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఐ వై ఆర్ కృష్ణారావు, గోపాల్ ఎంతో చక్కగా, సౌమ్యంగా పనిచేశారని చింతా మోహన్ తెలిపారు. మరోవైపు.. అమిత్ షా కొడుకుకి సాయంకాలం సమయంలో ఏ పద్ధతి ప్రకారం దర్శనం కల్పించారు..? అని ప్రశ్నించారు. అమిత్ షా కొడుకు శ్రీవారి దర్శనం చేసుకునే సమయంలో ఏ ఉన్నతాధికారి పక్కన ఉన్నారు? టీటీడీ సమాధానం చెప్పాలని కోరారు. నిన్న ఒక చిన్న నాయకుడు సిఫార్సు లేఖ ఇస్తే, 20 మందికి శ్రీవారి దర్శనానికి ఎలా అనుమతిస్తారు..? అని అన్నారు.
Read Also: Small savings schemes: చిన్న మొత్తాలపై పాత వడ్డీ రేట్లే.. కేంద్రం ప్రకటన
నిద్రపోతున్న భారతీయ జనతా పార్టీ అపవిత్రత, పవిత్రత అంటూ లడ్డు గురించి, నెయ్యి కల్తీ గురించి గగ్గోలు పెట్టిందని చింతా మోహన్ పేర్కొన్నారు. స్థానికులకు ప్రతి మంగళవారం ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శనం అడిగితే ఇప్పటి వరకు టిటిడి నోరు మెదపడం లేదు.. జగన్ చూసి కూటమి ప్రభుత్వం భయపడుతోంది.. తిరుపతిలో పోలీస్ రాజ్యం నడుస్తోంది.. నెల రోజులు పోలీస్ 30 యాక్ట్ అమలు చేయడం ఏమిటి? అని ప్రశ్నించారు. 30 యాక్ట్ పేరుతో సభలు, సమావేశాలు జరగకుండా పోలీసులు పొలిటికల్ పార్టీలను అడ్డుకుంటున్నారు.. తిరుపతి నగరంలో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా ఫ్లెక్సీలు, కటౌట్లు కనిపిస్తున్నాయని చింతా మోహన్ పేర్కొన్నారు.