తెలంగాణలో ఇటీవలే వైఎస్ షర్మిల కొత్త పార్టీని ప్రకటించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో పార్టీని స్థాపించిన షర్మిల, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులు కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఉద్యోగాలు వస్తాయనే విశ్వాసంతో పోరాటం చేశారు. కానీ, తెలంగాణ వచ్చినప్పటికీ నిరుద్యోగ సమస్యలు తీరిపోలేదు. దీంతో ఇప్పటికీ నిరుద్యోగులు నిరసలు చేస్తూనే ఉన్నారు.
Read: దుమ్మురేపుతున్న అజిత్ ‘వాలిమై’ మోషన్ పోస్టర్
వారికి మద్దతుగా వైస్ షర్మిల పోరాటం చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రతి మంగళవారం రోజున రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతంలో నిరసన దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా రేపు వనపర్తి నియోజక వర్గంలోని తాడిపర్తిలో నిరుద్యోగ నిరసన దీక్షచేయబోతున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరుద్యోగ నిరాహార దీక్ష కొనసాగబోతున్నది.