దుమ్మురేపుతున్న అజిత్ ‘వాలిమై’ మోషన్ పోస్టర్

తమిళ స్టార్ హీరో అజిత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే తాజాగా హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘వాలిమై’ చిత్రం నుంచి అప్డేట్ వచ్చేసింది. యాక్షన్‌ థ్రిల్లర్‌ గా వస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ అభిమానుల్లో అనందాన్ని నింపాయి. కొద్దిరోజులుగా ‘వాలిమై’ చిత్రం అజిత్ లుక్ విడుదల చేయాలంటూ అభిమానులు సోషల్ మీడియాలో గట్టిగానే డిమాండ్‌ చేశారు. దీనిపై అజిత్ కూడా అసహనం వ్యక్తం చేశారు. కాగా, ప్రస్తుతం ఇచ్చిన అప్డేట్ తో ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఇండియా వైడ్ గా ‘వాలిమై’ ట్రెండ్ అవుతోంది. ఇందులో అజిత్‌ సీబీ సీఐడి అధికారిగా కనిపించనున్నారు. ఆయనకు జోడీగా హ్యుమా ఖురేషి నటిస్తుండగా, టాలీవుడ్‌ నటుడు కార్తికేయ విలన్‌గా నటిస్తున్నారు. బేవ్యూ ప్రొజెక్ట్స్‌ పతాకంపై బోనీకపూర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యువన్‌ శంకర్‌రాజా స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ ఏడాదే వాలిమై చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది.

Image
Image
-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-