Site icon NTV Telugu

వైఎస్‌ షర్మిల కీలక నిర్ణయం.. ఇక ఊరూరా వైఎస్‌ఆర్ జెండా పండుగ..

YS Sharmila

YS Sharmila

తెలంగాణలో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ పేరుతో పార్టీని స్థాపించి సమస్యలపై పోరాటం చేస్తున్నారు ఆ పార్టీ అధినాయకురాలు వైఎస్‌ షర్మిల… ముఖ్యంగా నిరుద్యోగుల సమస్యలపై ఫోకస్‌ పెట్టారు… ప్రతీ మంగళవారం ఒక ప్రాంతంలో దీక్ష చేస్తూ వస్తున్నారు.. తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యంగా చెబుతున్న ఆమె.. రాజన్న యాదిలో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఊరూరా వైయస్ఆర్ జెండా పండుగ నిర్వహించాలని నిర్ణయించారు.. ఆగస్టు 5వ తేదీ నుంచి జెండా పండుగ నిర్వహించాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు వైఎస్‌ షర్మిల… గ్రామాలు, మండలకేంద్రాలు, పట్టణాలు, నగరాల్లో వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ జెండాలు ఆవిష్కరించాలని సూచించారు.. ఇక, రేపు పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు వైఎస్‌ షర్మిల.. పార్లమెంటరీ కన్వీనర్, కో-కన్వీనర్లకు, నాయకులకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు పార్టీ అధినేత్రి.

Exit mobile version