NTV Telugu Site icon

తెలంగాణ‌లో వైసీపీ బ‌లోపేతం కానుందా?

ఇప్ప‌టి వ‌ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ‌లో కూడా తిరిగి బ‌లోపేతం అయ్యేందుకు పావులు క‌దుపుతున్న‌ది.  2014 ఎన్నిక‌ల్లో తెలంగాణ నుంచి పోటీ చేసి కొన్ని సీట్లు గెలుచుకున్న‌ప్ప‌టికీ ఆ పార్టీ దృష్టిమొత్తం ఏపీపైనే ఉంచ‌డంతో తెలంగాణ‌లో పార్టీ వెనుక‌బ‌డిపోయింది.  ఇక, 2018 తెలంగాణ ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అస‌లు పోటీనే చేయ‌లేదు.  దీంతో ఆ పార్టీ తెలంగాణ‌లో పూర్తిగా బ‌ల‌హీన‌ప‌డింది.  ఒక‌ప్పుడు అనేక మంది కార్య‌క‌ర్త‌లు, నేత‌లు ఉండేవారు.  రాష్ట్రంలో అనేక పార్టీ కార్య‌ల‌యాలు ఉండేవి.  కానీ, వాటిని మూసివేశారు.  

Read: నాగార్జున, ప్రవీణ్ సత్తారు మూవీ షూటింగ్ ఎప్పుడంటే ?

కాగా, ఇప్పుడు మ‌ర‌లా ఆ పార్టీని బ‌లోపేతం చేసేందుకు పావులు క‌దుపుతున్న‌ట్టు స‌మాచారం.  వైఎస్ జ‌గ‌న్ అభిమానులు రాష్ట్రంలో పార్టీని బ‌లోపేతం చేయాల‌ని జ‌గ‌న్ పై ఒత్తిడి తీసుకొస్తున్నార‌ని స‌మాచారం.  త్వ‌ర‌లోనే పార్టీని బ‌లోపేతం చేసేదిశ‌గా ముందుకు సాగుతామ‌ని తెలంగాణ వైసీపీ నేత‌లు చెబుతున్నారు.  వైఎస్ఆర్, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఫొటోల‌తో రాష్ట్ర‌మంతా తిరిగి పార్టీని బ‌లోపేతం చేస్తామ‌ని, ఈనెల 10వ తేదీలోగా పార్టీ కేంద్ర కార్యాల‌యాన్ని ప్రారంభం చేస్తామ‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు చెబుతున్నారు.  ఇప్ప‌టికే తెలంగాణ‌లో వైఎస్ ష‌ర్మిల వైఎస్ఆర్ టీపీ పేరుతో పార్టీని ప్రారంభించారు.  సొంతంగా జ‌గ‌న్ స‌పోర్ట్ లేకుండానే పార్టీని న‌డిపిస్తున్నారు.  రాబోయే ఎన్నిక‌ల నాటికి రాష్ట్రంలో పార్టీని బ‌లోపేతం చేసేందుకు ఇప్ప‌టినుంచే ఆమె ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు.  దీక్ష‌లు చేస్తున్నారు.  ఈ స‌మ‌యంలో వైసీపీ కూడా తెలంగాణ‌లోకి అడుగుపెడితే రెండు పార్టీల మ‌ధ్య పోటీ ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది క‌దా..!!