Site icon NTV Telugu

హుజూరాబాద్ ఉప ఎన్నికలో నిరుద్యోగులు పోటీ చేయాలి…

హుజూరాబాద్ ఉప ఎన్నికలో నిరుద్యోగులు పోటీ చేయాలి అని వైస్సార్ తెలంగాణ పార్టీ తెలిపింది. రాష్ట్రంలో నిరుద్యోగులు వందల సంఖ్యలో చనిపోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తోంది. నోటిఫికేషన్లు జారీ చేయడంలో తీవ్ర జాప్యం చేస్తోంది. రేపు, మాపు అంటూ నిరుద్యోగులను మభ్యపెడుతోంది. యువత ఏజ్ బార్ అవుతున్నా పట్టించుకోవడం లేదు. నిరుద్యోగులు కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలంటే.. వచ్చే హుజూరాబాద్ ఉప ఎన్నికలో వందల సంఖ్యలో నామినేషన్లు వేయించి కేసీఆర్ మెడలు వంచాలని వైస్సార్ తెలంగాణ పార్టీ నిర్ణయించింది. ఇక నుంచి నిరుద్యోగుల పక్షాన YSR తెలంగాణ పార్టీ పోరాటం మరింత ఉదృతం చేస్తుంది. పూర్తి స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేసే వరకూ యువత పక్షాన నిలబడుతుంది అని పేర్కొంది.

Exit mobile version