NTV Telugu Site icon

YS Sharmila: ఇంట్లో వృద్దులు, వికలాంగులకు 3 వేలు పెన్షన్

Ys Sharmila

Ys Sharmila

మీరు ఆశీర్వదించండి… తెలంగాణలో వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకు వస్తానని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ అనంతగిరి మండలం శాంతి నగర్ కు చేరుకున్న వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల, వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించారు.

ఈ సందర్బంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ..తెలంగాణాలో వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకు రావడమే ధ్యేయమ‌ని అన్నారు. వైఎస్సార్ హయాంలో తెలంగాణ సుభిక్షం గా ఉందని పేర్కొన్నారు. కులాలకు మతాలకు అతీతంగా అన్ని వర్గాలను వైఎస్సార్ ఆదుకున్నారని గుర్తు చేసారు. వైఎస్సార్ ఏ పథకం చేసినా అద్భుతంగా చేసి చూపించారని ష‌ర్మిళ అన్నారు. 8 ఏళ్లుగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ప్రతి వర్గాన్ని మోసం చేశారని విమ‌ర్శించారు.

డబుల్ బెడ్ రూం అని మోసం.. మూడు ఎకరాల భూమి అని మోసం.. ఇలా ప్రతి వర్గాన్ని మోసం చేశారని మండిప‌డ్డారు. మీరు ఆశీర్వదించండి.. వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకు వస్తా అని వైఎస్ ష‌ర్మిళ అన్నారు. ప్రతి పేద కుటుంబానికి మహిళ పేరు మీద పక్కా ఇల్లు నిర్మిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇంట్లో ఎంత మంది వృద్దులు.. వికలాంగులు ఉన్నా అందరికీ 3 వేలు తక్కువ కాకుండా పెన్షన్ ఇస్తామ‌ని ఈసంద‌ర్భంగా ష‌ర్మిళ‌ పేర్కొన్నారు. కాగా.. బొజగూడెం, తామరబండ పాలెం మీదుగా షర్మిల పాదయాత్ర అనంత‌రం.సాయంత్రం 4 గంటలకు కోదాడలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు వైఎస్ షర్మిల.

Bharat Bandh: భారత్‌ బంద్‌ ఎఫెక్ట్.. దిల్లీ సరిహద్దులో భారీ ట్రాఫిక్‌ జామ్