Site icon NTV Telugu

ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో షర్మిల పర్యటన

తెలంగాణలో పార్టీ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు వైఎస్ షర్మిల.. ఇప్పటికే వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘంలో కూడా రిజిస్ట్రర్‌ చేశారు.. వచ్చే నెలలో పార్టీ జెండా, అజెండా ప్రకటించనున్నారు. వచ్చే నెలలోనే పార్టీ ఏర్పాటు చేయనున్నారు షర్మిల. అయితే.. ప్రజలకు దగ్గర కావాలనే నేపథ్యంలో వరుసగా జిల్లాల పర్యటనలు షర్మిల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇవాళ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి.. కేటీఆర్‌ ఇలాకా అయిన రాజన్న సిరిసిల్లాలో వైఎస్‌ షర్మిల పర్యటించనున్నారు. ఈ సందర్బంగా పార్టీ యూత్‌ అధ్యక్షుడు అరుణ్‌ విక్రమ్‌ రెడ్డిని షర్మిల పరామర్శించనున్నారు. అనంతరం అల్మాస్‌ పూర్‌లో కరోనా మహమ్మారితో బలైన.. కుటుంబాన్ని షర్మిల పరామర్శించనున్నారు. షర్మిల పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

Exit mobile version