Site icon NTV Telugu

YS.Sharmila: కొడుకు ఫోటో షేర్ చేసిన షర్మిల.. అచ్చు అలాగే ఉన్నాడంటూ కామెంట్స్

Sharmila

Sharmila

YS.Sharmila: ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెల్లి షర్మిల. ప్రస్తుతం తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి ప్రజల మన్ననలు అందుకోవడానికి ప్రయత్నిస్తున్న విషయం తెల్సిందే. షర్మిల భర్త అనిల్ కుమార్ సైతం ఒక పాస్టర్ గా అందరికి సుపరిచితుడే. వీరందరిని ప్రతి ఒక్కరు నిత్యం టీవీల్లో, సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. కానీ, వీరి పిల్లలు మాత్రం ఎప్పుడు బయట కనిపించిందే లేదు. సాధారణంగా సినీ ప్రముఖుల పిల్లలను చూడాలని అభిమానులు ఎలా కోరుకుంటారో.. రాజకీయ నేతల పిల్లలు ఎలా ఉంటారు అనేది చాలామందికి ఆసక్తి. ఇక ఇటీవలే షర్మిల తన ముద్దుల తనయుడి ఫోటోను షేర్ చేయడం, అది కాస్తా వైరల్ గా మారడం జరిగిపోయాయి.

Read Also: Harsimrat Badal: మా సీఎం తాగి రాష్ట్రాన్ని నడుపుతున్నారు.. అకాలీదళ్ ఎంపీ సంచలన ఆరోపణలు

షర్మిలకు ఏకైక వారసుడు వైఎస్ రాజారెడ్డి. ప్రస్తుతం రాజా విదేశాల్లో చదువుకుంటున్నాడు. ఇక ఈ మధ్యనే రాజా పుట్టినరోజు కావడంతో షర్మిల, కొడుకుకు ప్రత్యేకంగా విషెస్ తెలిపింది. సముద్రపు ఒడ్డున తల్లిని పట్టుకొని రాజా చిరు మందహాసం చేస్తూ కనిపించాడు. ఇక రాజాను చూసినవారందరు ఆశ్చర్యపోతున్నారు. 17 ఏళ్ల వయస్సుల్లోనే హీరో కటౌట్ తో దర్శనమిచ్చాడు. నిజంగా షర్మిలకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడంటే ఆశ్చర్యంగా ఉందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా అచ్చు హీరోలానే ఉన్నాడంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి రాజా భవిష్యత్ లో.. తాత, మావయ్యల రాజకీయాల్లోకి అడుగుపెడతాడా..? కటౌట్ కు తగ్గట్టు సినిమాల్లో ఏమైనా ప్రయత్నిస్తాడా..? అనేది చూడాలి.

Read Also: Pakistan: ఇంగ్లండ్ చేతిలో క్లీన్ స్వీప్.. బాబర్ ఆజమ్ ఖాతాలో చెత్త రికార్డు

Exit mobile version