హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి ఓడిపోవడంతో హుజూరాబాద్‌లో కేసీఆర్‌కు ప్రజలు బాగా బుద్ధి చెప్పారంటూ షర్మిల ట్వీట్ చేశారు. ఒక ఉప ఎన్నిక కోసం రూ.వేల కోట్లు ఖర్చుపెట్టిన కేసీఆర్‌కు చెంపచెల్లుమనేలా ఓటర్లు తీర్పు ఇచ్చారని ఆమె అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజలు బానిసలు కాదని.. ఉద్యమకారులని ఈ ఎన్నిక ద్వారా నిరూపించారని షర్మిల కొనియాడారు. కేసీఆర్ గారడీ మాటలు, పిట్టకథలు జనం నమ్మరని… ఇకనైనా కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు.
కేసీఆర్‌కు ప్రజలు బాగా బుద్ధి చెప్పారు: షర్మిల
