NTV Telugu Site icon

YS Sharmila: రైతులను బెదిరిస్తున్నారు.. మనం ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్నామా..?

Ys Sharmila

Ys Sharmila

అధికార టీఆర్ఎస్‌ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైఎస్‌ఆర్‌ టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల… ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని చేపట్టిన ధర్నాలో పాల్గొన్న ఆమె… ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను వెన్నుపోటు పొడిచాడని మండిపడ్డారు.. ఈ రోజు రాష్ట్రంలోని ప్రతి పైసా సంపద తెలంగాణ ప్రజలదేనన్న ఆమె.. తెలంగాణ ప్రజల నెత్తిన కేసీఆర్ నాలుగు లక్షల కోట్ల అప్పు పెట్టారంటూ ఆరోపించారు..

Read Also: Telangana: పరిపాలన గాడి తప్పింది.. గవర్నర్ జోక్యం చేసుకోవాలి..

ఇక, కమీషన్ల రూపంలో తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుతింటున్నారంటూ ఆరోపించారు వైఎస్‌ షర్మిల… మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు రైతులు నిరసన తెలపకపోతే రైతు బంధు కట్ చేస్తామన్నారంటూ మండిపడ్డ ఆమె… తన ఇంట్లో సొమ్ము ఇవ్వడం లేదు కదా? అని ప్రశ్నించారు. రైతులను బెదిరిస్తున్నారు, ఇది ప్రజాస్వామ్యమా..? మనం ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్నామా..? వాళ్లేమన్న తాలిబన్ల.. రైతులను బెదిరించడానికి అంటూ సెటైర్లు వేశారు.. మరోవైపు.. కేంద్రం పెట్రోల్, డీజల్ ధరలు పెంచితే.. రాష్ట్రం కూడా నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ ఛార్జీలు పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్‌ షర్మిల.