NTV Telugu Site icon

వైఎస్‌ షర్మిల రైతు ఆవేదన యాత్ర

YS Sharmila

YS Sharmila

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మరోసారి జనంలోకి వెళ్తున్నారు.. మంగళవారం దీక్షలు, పాదయాత్ర, ఆందోళన కార్యక్రమాలు, ధర్నాలతో.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్న ఆమె… ఇక, సోషల్‌ మీడియా వేదికగా ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ను టార్గెట్‌ చేస్తూ వస్తున్నారు. పాదయాత్ర వాయిదా పడిన తర్వాత కూడా విమర్శలు చేస్తున్న ఆమె.. ఇప్పుడు మరోసారి జనంలోకి వెళ్తున్నారు.. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు.. అందులో భాగంగా ఇవాళ రైతు ఆవేదన యాత్ర చేపడుతున్నారు. మొదటి రోజు మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ నియోజకవర్గం కంచనపల్లిలో రైతులు శ్రీకాంత్‌, మహేష్‌ కుటుంబాలను పరామర్శించనున్నారు వైఎస్‌ షర్మిల.. ఆ తర్వాత లింగంపల్లిలో షేకులు అనే రైతు కుటుంబాన్ని ఓదార్చనున్నారు. ఇక, ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా నిలిచిపోయిన పాదయాత్రను మళ్లీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.. పార్టీ నేతలు చెబుతున్న ప్రకారం.. సంక్రాంతి పండుగ తర్వాత వైఎస్‌ షర్మిల పాదయాత్ర పున:ప్రారంభం కానుంది.