Site icon NTV Telugu

మంగళవారం దీక్షలు వాయిదా వేసిన వైఎస్‌ షర్మిల..

తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం లక్ష్యంగా కొత్త పార్టీని ఏర్పాటు చేసిన వైఎస్‌ షర్మిల.. వివిధ సమస్యలపై పోరాటం చేస్తూ వస్తున్నారు.. పాదయాత్ర, దీక్షలు, ధర్నాలు.. ఇలా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక, నిరుద్యోగ సమస్యను పోరాట ఆయుధంగా తీసుకున్న వైఎస్‌ షర్మిల.. ప్రతీ మంగళవారం ఒక ప్రాంతాన్ని ఎంచుకుని నిరుద్యోగ దీక్షలు చేస్తున్నారు.. ఉన్నత చదువులు చదవి ఉద్యోగం దొరకక ఆత్మహత్య చేసుకున్నవారి కుటుంబాలను పరామర్శించడం.. ఆ తర్వాత ఒక్కరోజు దీక్ష చేసి.. ప్రభుత్వ విధానాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణం వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల.. ప్రతీ మంగళవారం చేస్తున్న నిరుద్యోగ దీక్షలు తాత్కాలికంగా వాయిదా వేశారు.. ఈ మేరకు వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది.

Exit mobile version