NTV Telugu Site icon

ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో షర్మిల పార్టీ పోటీ చేస్తుందా? 

వైఎస్ షర్మిల ఏప్రిల్ 9 వ తేదీన ఖమ్మంలో కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు  ప్రకటించిన సంగతి తెలిసిందే.  తన పార్టీ పేరు, జెండా అజెండాను వైఎస్ఆర్ జయంతి రోజున ప్రకటిస్తానని చెప్పారు.  ఇక నిరుద్యోగుల కోసం ఆమె ఈరోజు నుంచి మూడు రోజులపాటు నిరాహారదీక్ష చేయబోతున్నారు.  ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆమె దీక్షకు దిగుతున్నారు. 

ఇక ఇదిలా ఉంటె, త్వరలోనే రాష్ట్రంలో ఖమ్మం మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి.  ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్ షర్మిల ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.  ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే తమ పార్టీ సత్తా ఏంటో తెలుస్తుందని, ముందుగానే బరిలో దిగడం వలన వచ్చే ఎన్నికల నాటికి మరింత బలం పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని షర్మిల మద్దతుదారులు ఆమెని ఒత్తిడి తీసుకొస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.  అయితే, కొత్త పార్టీని ఇంకా ప్రకటించలేదు కాబట్టి ఆమె మద్దతు దారులు స్వతంత్రంగానే బరిలోకి దిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.