తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల.. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నారు… ముఖ్యంగా నిరుద్యోగ సమస్యపై ఫోకస్ పెట్టిన ఆమె.. నిరుద్యోగ నిరాహార దీక్ష పేరుతో.. ప్రతీ మంగళవారం దీక్ష చేస్తూ వస్తున్నారు.. అందులో భాగంగా… ఇవాళ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో దీక్ష చేయనున్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. హుజురాబాద్ నియోజర్గంలోని ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో ఇవాళ దీక్షకు కూర్చోనున్నారు.. సిరిసేడు గ్రామం చేరుకున్న వెంటనే మొదట.. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి మహమ్మద్ షబ్బీర్ కుటుంబాన్ని పరామర్శించనున్న షర్మిల.. ఆ తర్వాత ఒకరోజు దీక్ష చేయనున్నారు.
నేడు హుజురాబాద్‌లో వైఎస్ షర్మిల దీక్ష

YS Sharmila