పేద వాళ్ల కోసం వైఎస్ ఆరోగ్య శ్రీ పథకం తెచ్చారు. కార్పొరేట్ ఆస్పత్రిలో ఉచిత వైద్యం అందించారు. అంతకముందు ఒక్క నాయకుడు కూడా ఇలా ఆలోచించలేదు. నా తండ్రిది పెద్ద మనసు అని వైస్ షర్మిల పేర్కొన్నారు. కుటుంబాలని నిలబెట్టిన పథకం అది. కానీ తెలంగాణ లో ఆరోగ్య శ్రీ అందడం లేదు. కరోనా రోగాన్ని ఆరోగ్య శ్రీ లో ఎందుకు చేర్చలేదు. పేద వాళ్ళ ను తెలంగాణ సర్కారు ఆదుకోవడం లేదు అని అన్నారు. ఫామ్ హౌస్ నుండి బయటకు వస్తే నిజాలు తెలుస్తాయి. ఆరోగ్య శ్రీ లో కరోనా చేర్చాలి. ఆయుష్మన్ భారత్ అమలు చేస్తే లాభమ్ లేదు. కేసీఆర్ మాత్రం యశోద ఆస్పత్రికి వెళ్తారు. పేదవారు మాత్రం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలా… మీకో న్యాయం పేద వారికి ఓ న్యాయమా అని ప్రశ్నించారు. చేల్లెళ్ల కన్నీళ్లకు విలువ లేదా అని అడిగారు. అలాగే ప్రస్తుత సమయంలో కోవిడ్ తో చనిపోయిన వారికి ఐదు లక్షలు ఇవ్వాలి అని పేర్కొన్నారు.